హోమ్ /వార్తలు /national /

మళ్లీ సెంటిమెంట్‌ను నమ్ముకున్న చంద్రబాబు ?

మళ్లీ సెంటిమెంట్‌ను నమ్ముకున్న చంద్రబాబు ?

అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు.. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.

అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు.. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.

గత ఎన్నికల్లో టీడీపీ సొంతంగా బరిలోకి దిగడం ఆ పార్టీకి ఏ మాత్రం కలిసిరాలేదు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే ఈ విషయంలోనూ కొందరు నేతలు సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటారు. తాజాగా ఏపీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రకమైన సెంటిమెంట్‌ను ఫాలో కానున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీట్ల లెక్క తేలకపోయినా... ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఖరారైంది. మళ్లీ ఎన్నికలు ఎప్పుడనే అంశంపై క్లారిటీ వచ్చిన వెంటనే... ఈ రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది.

సీపీఐతో పాటు మరో లెఫ్ట్ పార్టీ సీపీఎంతోనూ టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ పొత్తుల అంశాన్ని చంద్రబాబు ఓ రకంగా సెంటిమెంట్‌గా భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చాలాసార్లు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినప్పుడే టీడీపీకి విజయం దక్కింది.

గత ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా బరిలోకి దిగడం వారికి ఏ మాత్రం కలిసిరాలేదు. దీంతో పార్టీకి పొత్తులు సెంటిమెంట్ పరంగానూ కలిసొస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమరావతి ఉద్యమంలో తమతో పాటు కలిసొచ్చిన సీపీఐతో పొత్తు పెట్టుకోవడం సహేతుకమే అని టీడీపీ భావిస్తోంది. మొత్తానికి మళ్లీ పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న టీడీపీకి... ఈ సెంటిమంట్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, Ap local body elections, Chandrababu naidu, CPI, CPM

ఉత్తమ కథలు