హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll: దుబ్బాక ఉప ఎన్నికకు ముందే రసవత్తర ఘట్టం

Dubbaka ByPoll: దుబ్బాక ఉప ఎన్నికకు ముందే రసవత్తర ఘట్టం

సోలిపేట రామలింగారెడ్డి (File)

సోలిపేట రామలింగారెడ్డి (File)

Dubbaka By Elections | దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటాపోటీకి అయా పార్టీల అభ్యర్థులు గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

  Dubbaka Assembly Bypolls | టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక మీద అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటాపోటీకి అయా పార్టీల అభ్యర్థులు గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డి, చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ పెద్దలు మాత్రం రామలింగారెడ్డి కుమారునికి టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ లో టిక్కెట్ రాకపోతే ముత్యం రెడ్డికి కాంగ్రెస్ పార్టీ లో మంచి పేరు ఉంది. టీడీపీలో సివిల్ సప్లై మంత్రి గా పదవులు అనుభావించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ తీసుకొని పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇద్దరు మధ్య రెండు పార్టీల పెద్దలకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుండే విశ్వ ప్రయత్నలు చేస్తుంది. కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు.

  దుబ్బాక నియెజికవర్గం నుంచి బీజేపీ గతంలో 2018, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావు ఓటమి చెందారు. ఆ తర్వాత 2019లో బీజేపీ నుంచి మెదక్ ఎంపీ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందన్ రావును బరిలో దింపనున్నట్టు తెలుస్తోంది. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా అవిష్కరణలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలపై కమలదళం దుబ్బాక నియెజికవర్గంలో విస్తృత ప్రచారం చేస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశలు కనిపిస్తున్నాయి. దుబ్బాకలో పోటీ చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు