POLITICS AJIT PAWAR NEW OPPOSITION LEADER IN MAHARASHTRA ASSEMBLY PVN
Ajit Pawar : ఎన్పీపీ నేత అజిత్ పవార్ కు కీలక పదవి
అజిత్ పవార్(ఫైల్ ఫొటో)
Ajit Pawar : మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్ష(Floor Test)లో ఏక్నాథ్ షిండే(Eknath Shinde)సర్కార్ గెలిచింది. షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. బలపరీక్షలో గెలవాలంటే 144 మంది మద్దతు ఉంటే సరిపోతుంది.
Ajit Pawar: ఎన్సీపీ(NCP)నాయకుడు,మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar)..మహారాష్ట్ర అసెంబ్లీ(Maharashtra Assembly)లో ప్రతిపక్ష నేత(Opposition Leader)గా ఇవాళ నియమితులయ్యారు. స్పీకర్ రాహుల్ నార్వేకర్ అసెంబ్లీలో సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద పార్టీగా ఎన్సీపీ ఉన్నట్లు స్పీకర్ రాహుల్ నార్వేకర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేత జయంత్ పాటిల్ ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్ పేరును ప్రతిపాదించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపినట్లు అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు.
మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్ష(Floor Test)లో ఏక్నాథ్ షిండే(Eknath Shinde)సర్కార్ గెలిచింది. షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. బలపరీక్షలో గెలవాలంటే 144 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అయితే ఏక్ నాథ్ సర్కార్‌కు 164 మంది శాసనసభ్యులు మద్దతు ఇచ్చారు. 99 మంది షిండే సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయగా మరో ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. నిన్నటి వరకు ఉద్ధవ్ ఠాక్రే శిబిరంతో ఉన్న ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ఇవాళ బలపరీక్షలో ఏక్నాథ్ షిండేకు మద్దుతుగా ఓటు వేశారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బలపరీక్షలో విజయంతో ప్రస్తుతం కేబినెట్ కూర్పుపై దృష్టిపెట్టిన షిండే.. వచ్చేవారం సుప్రీంకోర్టు వెల్లడించనున్న తీర్పుకోసమూ ఎదురుచూస్తున్నారు. శివసేన పార్టీ మొత్తంగా ఉద్ధవ్ ఠాక్రేకు చెందాలా? షిండే వర్గానిదేనా? అనే వివాదంపై సుప్రీంకోర్టు ఈనెల 11న విచారించనుంది. వివాదంలో షిండే వర్గానికే టెక్నికల్ ఎడ్జ్ ఉండటంతో ఉద్ధవ్ త్వరలోనే సేన లేని శివసేనానిగా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక,బీజేపీ-శివసేన రెబల్ వర్గం పొత్తుతో ఏర్పడిన ప్రభుత్వం ఆరు నెలలకు మించి మనలేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. క్యాబినెట్ కూర్పు తర్వాత శివసేన రెబల్స్ లో చాలా మంది సీఎం షిండేపై తిరుగుబాటు చేస్తారని, నిజానికి షిండేకు మద్దతు పలికిన రెబల్స్‌లో అనేక మందికి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇష్టం లేదని, క్యాబినెట్ విస్తరణతో వారిలో అసంతృప్తి బయటకు వస్తుందని జోస్యం చెప్పారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఆరు నెలల్లోపే మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు తప్పవని, అందుకోసం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులతో పవార్ అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.