Home /News /national /

POLITICS AIADMK GENERAL COUNCIL MEET UPDATES OPS EXPELLED FROM PARTY AFTER EPS ELECTED AS GS ANGRY OPS BREAKS OFFICE DOOR TAMIL NADU MKS

AIADMK : పన్నీర్ సెల్వంపై బహిష్కరణ వేటు.. ఇనుప రాడ్లతో పార్టీ ఆఫీసు బద్దలు.. చెప్పులు విసిరి..

ఆఫీస్ తలుపులు బద్దలు కొడుతోన్న ఓపీఎస్ వర్గీయులు

ఆఫీస్ తలుపులు బద్దలు కొడుతోన్న ఓపీఎస్ వర్గీయులు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికను వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం వర్గీయులు పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. క్రమశిక్షణ చర్యల కింద ఓపీఎస్ పై బహిష్కరణ వేటు పడింది. రెండు వర్గాలు కొట్లాటకు దిగాయి. వివరాలివే..

అమ్మ జయలలిత మరణం తర్వాత క్రమంగా ఆగమైన ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) (AIADMK)పార్టీ ఇప్పుడు పతనావస్థకు చేరిందా? అనిపించేతలా అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశం రసాభసగా మారింది. ఎడిపాడి పళనిస్వామి (Edappadi Palaniswamy) (ఈపీఎస్), ఓ.పన్నీర్ సెల్వం (O Pannerselvam) (ఓపీఎస్) వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కొత్త ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ఓపీఎస్ వర్గీయులు పార్టీ ఆఫీసును ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేశారు. క్రమశిక్షణ చర్యల కింద ఓపీఎస్ పై బహిష్కరణ వేటు పడింది.

తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి సోమవారం నాడు చెన్నైలో నాటకీయ పరిస్థితులు తలెత్తాయి. వనగారంలో సోమవారం ఉదయం జరిగిన కార్యవర్గ సమావేశంలో పార్టీ సారధ్యంపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మ మరణం తర్వాత పళనిస్వామి(ఈపీఎస్) పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గాల మధ్య సయోధ్య కోసం ఏర్పాటు చేసిన ద్వంద్వ నాయకత్వ విధానాన్ని ఇవాళ్టి కార్యవర్గ భేటీలో రద్దు చేశారు. అదే సమయంలో పార్టీకి ఏకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని నియమించారు. ఈ చర్య పన్నీర్ సెల్వం వర్గానికి శరాఘాతంలా మారింది.

AIADMK : అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామి వశం.. పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. రసాభసగా కార్యవర్గ భేటీ


నేటి కార్యవర్గ భేటీలో ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన ఓపీఎస్ కోర్టు ద్వారా సమావేశాన్ని నిలువరించేందుకు విఫలయత్నం చేశారు. రాజకీయ పార్టీల కుమ్ములాటలపై జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు.. కార్యవర్గ సమావేశం నిర్వహణపై స్టే విధించలేమని చెప్పడంతో అటు కోర్టులో, ఇటు పార్టీలో ఓపీఎస్ కు వరుస షాకులు తగిలినట్లయింది. వనగారంలో కార్యవర్గ సమావేశం జరుగుతుండగా, ఓపీఎస్ తన వర్గీయులతోకలిసి రోయపేటలోని అన్నాడీఎంకే ప్రధానకార్యాలయానికి చేరుకున్నారు.

https://twitter.com/i/status/1546382390498840576

KCR కుటుంబంలోనే ఏక్‌నాథ్ షిండేలు : BJP బండి తాజా బాంబు -జోగులాంబను సీఎం అవమానించారంటూ..


అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయానికి తాళాలు వేసిఉండటంతో, ఓపీఎస్ వర్గీయులు ఇనుప రాడ్లతో ద్వారాన్ని ధ్వంసం చేసి లోనికి చొచ్చుకుపోయారు. పార్టీ ఆఫీసు వద్ద ఉన్న ఈపీఎస్ చిత్రపటాలను ఓపీఎస్ వర్గీయులు చెప్పులతో కొట్టారు. పార్టీ ఆఫీసు వద్ద చోటుచేసుకున్న సంఘటనలపై వనగారం వేదికగా భేటీ అయిన కార్యవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పన్నీర్ సెల్వాన్ని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలనే తీర్మానాన్ని కార్యవర్గం ఏకపక్షంగా ఆమోదించింది. దీంతో..


Vijay Mallya : విజయ్ మాల్యాకు షాక్.. 4నెలల జైలుశిక్ష.. కుటుంబం ఆ డబ్బు కట్టాలి: సుప్రీంకోర్టు


అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వాన్ని బహిష్కరించినట్లు కొత్త ప్రధాన కార్యదర్శి పళని స్వామి స్వయంగా ప్రకటించారు. పన్నీర్ చర్యలను ఖండిస్తూ పళని వర్గం నేతలు సమావేశంలో దూకుడు వ్యాఖ్యలు చేశారు. పళనిస్వామిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేదాకా విశ్రమించబోమని అన్నాడీఎంకే కార్యవర్గం పేర్కొంది. అయితే, పార్టీని పూర్తిగా పళని కంట్రోల్ లోకి తీసుకోవడంతో రగిలిపోతున్న పన్నీర్ సెల్వం దాడులను కొనసాగిస్తారా? లేక ఏదైనా రాజీ ఫార్ములాకు అంగీకరిస్తారా? అనేది తేలాల్సి ఉంది..
Published by:Madhu Kota
First published:

Tags: AIADMK, Chennai, Palanisami, Tamil nadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు