Home /News /national /

POLITICS AIADMK GENERAL COUNCIL MEET UPDATES EPS ELECTED AS GENERAL SECRETARY SETBACK TO OPS AFTER MADRAS HC NOD CHENNAI TAMIL NADU MKS

AIADMK : అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామి వశం.. పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. రసాభసగా కార్యవర్గ భేటీ

అన్నాడీఎంకే కార్యవర్గ భేటీ దృశ్యాలు

అన్నాడీఎంకే కార్యవర్గ భేటీ దృశ్యాలు

అంతర్గత పోరుతో కకావికలమైన అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) (AIADMK)లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. పన్నీర్ సెల్వం వర్గానికి భారీ షాకిస్తూ పార్టీ పగ్గాలను పళనిస్వామి చేజిక్కించుకున్నారు. వివరాలివే..

అమ్మ జయలలిత మరణం, చిన్నమ్మ శశికళ కేసులపాలైన తర్వాత అంతర్గత పోరుతో కకావికలమైన అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) (AIADMK)లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. చెన్నై(Chennai)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన కార్యవర్గ సమావేశం రసాభసగా సాగింది. ఆ గందరగోళం మధ్యనే అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

అమ్మ మరణం తర్వాత ఎడిపాడి పళనిస్వామి(ఈపీఎస్), ఓ. పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గాల మధ్య సయోధ్య కోసం ఏర్పాటు చేసిన ద్వంద్వ నాయకత్వ విధానాన్ని ఇవాళ్టి కార్యవర్గ భేటీలో రద్దు చేశారు. అదే సమయంలో పార్టీకి ఏకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని నియమించారు. ఈ చర్య పన్నీర్ సెల్వం వర్గానికి శరాఘాతంలా మారింది. నిజానికి ఇలా జరుగుతుందని ముందే ఊహించిన ఓపీఎస్ కోర్టు ద్వారా సమావేశాన్ని నిలువరించేందుకు విఫలయత్నం చేశారు.

KCR కుటుంబంలోనే ఏక్‌నాథ్ షిండేలు : BJP బండి తాజా బాంబు -జోగులాంబను సీఎం అవమానించారంటూ..


పళనిస్వామి పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకోడానికే కార్యవర్గ భేటీని నిర్వహిస్తున్నాడని, అన్నాడీఎంకే రాజ్యాంగం ప్రకారం అది చెల్లుబాటు కాదని, ఈ సమావేశం జరగకుండా స్టే విధించాల్సిందిగా పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఈ వివాదంపై హైకోర్టు సోమవారం ఉదయం స్పష్టమైన తీర్పు చెప్పంది. రాజకీయ పార్టీల కుమ్ములాటలపై కోర్టు జోక్యం చేసుకోదన్న జడ్జిలు.. కార్యవర్గ సమావేశం నిర్వహణపై స్టే విధించలేమని చెప్పింది. తద్వారా అటు కోర్టులో, ఇటు పార్టీలో ఓపీఎస్ కు వరుస షాకులు తగిలినట్లయింది. కాగా,


CM KCR | BJP : అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్ సవాలుతో బీజేపీ ఇరుకున పడిందా?


అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం సందర్భంగా చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్రికత్త ఏర్పడింది. ఓపీఎస్‌-ఈపీఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వసం అయ్యాయి. పోస్టర్లను తగులబెట్టుకున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: AIADMK, Chennai, Palanisami, Tamil nadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు