హోమ్ /వార్తలు /national /

గద్దర్ కోసం కర్ణాటక పోలీసుల వేట.. అరెస్ట్ తప్పదా..?

గద్దర్ కోసం కర్ణాటక పోలీసుల వేట.. అరెస్ట్ తప్పదా..?

ప్రజా గాయకుడు గద్దర్(File)

ప్రజా గాయకుడు గద్దర్(File)

విద్యార్థి నాయకుడి నుంచి నక్సలైట్‌గా మారిన సాకేత్ రాజన్ హత్యకు ప్రతీకారంగా అప్పట్లో తూముకూరు రిజర్వ్ పోలీస్ క్యాంపుపై నక్సల్స్ ప్రతీకార దాడి జరిపారు. ఇందులో ఇద్దరు మైనర్లతో పాటు వరవరరావు, గద్దర్ కూడా నిందితులుగా ఉన్నారు.

ప్రజాయుద్ద నౌక గద్దర్ కోసం కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు. తెలుగు కవి, విరసం నేత, మావోయిస్టు సానుభూతిపరుడు వరవరరావును ఇప్పటికే అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు.. ఇప్పుడు గద్దర్ కోసం వేట ప్రారంభించారు. 2005 సంవత్సరంలో కర్ణాటకలోని తూముకూరు జిల్లాలోని పావగడలో స్టేట్ రిజర్వ్ పోలీస్ క్యాంపుపై నక్సల్స్ దాడిలో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. చార్జిషీట్‌లో 11వ నిందితుడిగా వరవరరావు, 12వ నిందితుడిగా గద్దర్‌ను పేర్కొన్నారు. భీమా కోరేగావ్‌ కేసులో పుణె జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న హక్కుల నేత వరవరరావును కర్ణాటక పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు.ఇప్పుడు గద్దర్‌ను అరెస్ట్ చేసేందుకు అక్కడి పోలీసులు సిద్దమవుతున్నారు.

కాగా, విద్యార్థి నాయకుడి నుంచి నక్సలైట్‌గా మారిన సాకేత్ రాజన్ హత్యకు ప్రతీకారంగా అప్పట్లో తూముకూరు రిజర్వ్ పోలీస్ క్యాంపుపై నక్సల్స్ ప్రతీకార దాడి జరిపారు. అందులో ఒక ఎస్ఐతో పాటు, ఏడుగురు కానిస్టేబుల్స్, ఒక సాధారణ పౌరుడు మృతి చెందారు. దీనికి సంబంధించి మొత్తం 109మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు 22మందిపై చార్జిషీట్ ఫైల్ చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లతో పాటు వరవరరావు, గద్దర్ కూడా ఉన్నారు.

First published:

Tags: Gaddar, Karnataka, Maoists, Naxals, Telangana, VaravaraRao