హోమ్ /వార్తలు /national /

Tirupathi Bypoll: దుబ్బాక, జీహెచ్ఎంసీ.. ఏపీలో బీజేపీ టార్గెట్ ఏంటి..?

Tirupathi Bypoll: దుబ్బాక, జీహెచ్ఎంసీ.. ఏపీలో బీజేపీ టార్గెట్ ఏంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tirupati ByPoll: ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఓట్లుగా మలచుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. 1999 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో బీజేపీ తిరుపతిలో గెలిచింది. ఇక 2004లో టీడీపీతో పొత్తుపెట్టుకొని 3లక్షల 11వేల ఓట్లు దక్కించుకుంది.

ఇంకా చదవండి ...

లోక్‌సభ ఎన్నికల్లో మూడూ సీట్లు, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో డివిజన్లు సొంతం. తెలంగాణాలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగురుతున్న బీజేపీకి నెక్స్ట్ టార్గెట్ ఏంటీ..? మిషన్ సౌత్ ఇండియాను సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్న కమలనాథులు తర్వాత ఏం చేయబోతున్నారు.? ఆంధ్రాలో జెండా పాతడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటి ఏపీలో పాగా వేయాలని సీరియస్‌గా ట్రై చేస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు రావడంతో బీజేపీ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే ఊపును ఏపీలోనూ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బీజేపీ.. 2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చడంతో పాటు జనసేనతో పొత్తుపెట్టుకుంది. ఈ క్రమంలోనే తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో తామేంటో చూపించాలని బలంగా ఫిక్సయింది. వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతితో ఖాళీ అయిన స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో జనసేనతో కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టేందుకు యత్నిస్తోంది. మోడీ మేనియా-పవన్ కల్యాణ్ ఛరిష్మా తిరుపతిలో విజయాన్ని కట్టబెడుతుందని కమలనాథులు భావిస్తున్నారు.

ఐతే గత రికార్డులు పరిశీలిస్తే ఒంటరిగా పోటీ చేసిన ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. 1998లో మాత్రమే బీజేపీకి సింగిల్ గా లక్షా 72వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 1999 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో బీజేపీ తిరుపతిలో గెలిచింది. ఇక 2004లో టీడీపీతో పొత్తుపెట్టుకొని 3లక్షల 11వేల ఓట్లు దక్కించుకుంది. 2009 కమలం పార్టీకి కేవలం 21వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో టీడీపీతో పొత్తుపెట్టుకోగా 5లక్షల 42వేల ఓట్లు వచ్చినా ఓటమే ఎదురైంది. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. కానీ ఈ ఎన్నికల్లో కేవలం 16వేల ఓట్లకే పరమితమైంది. ఈ ఎన్నికల్లో నోటాకు 25వేల ఓట్లు వచ్చాయంటేనే తెలుస్తోంది బీజేపీకి ఎంత పెద్ద దెబ్బతగిలింది.

ఐతే ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఓట్లుగా మలచుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. కాకపోతే 2019లో వైసీపీకి 2లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. 7లక్షల పైచిలుకు ఓట్లు వచ్చిన వైసీపీని ఢీ కొట్టడం బీజేపీకి పెద్ద సవాలే. పైగా రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని కాదని ఓటర్లు బీజేపీని ఆదరించే అవకాశం లేదనేది విశ్లేషకుల మాట. ఇదిలా ఉంటే తిరుపతి లోకసభ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాలే అధికంగా ఉండటం బీజేపీకి మైనస్. ఇక్కడ వైసీపీకి తిరుగులేదు. మరోవైపు వైసీపీతో పాటు టీడీపీ నుంచి కూడా బీజేపీకి బలమైన పోటీ ఎదురుకానుంది. ఐతే సోషల్ మీడియా ప్రచారం, ఎలక్షన్ మేనేజ్ మెంట్లో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. దీనికి తోడు హిందుత్వ పార్టీ అనే పేరు, పవన్ కల్యాణ్ సపోర్ట్ తిరుపతిలో మ్యాజిక్ చేస్తాయని బీజేపీ భావిస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Bjp, Tirupati Loksabha by-poll

ఉత్తమ కథలు