హోమ్ /వార్తలు /national /

నిన్న చిరంజీవి, ఇవాళ మహేష్.. రేపు ఎవరు? టాలీవుడ్‌లో చర్చ

నిన్న చిరంజీవి, ఇవాళ మహేష్.. రేపు ఎవరు? టాలీవుడ్‌లో చర్చ

చిరంజీవి, మహేష్ బాబు

చిరంజీవి, మహేష్ బాబు

చిరంజీవి, మహేష్ బాబు తర్వాత టాలీవుడ్‌ నుంచి జగన్‌ను కలిసేది ఎవరనే చర్చ సినీ ఇండస్ట్రీలో మొదలైంది.

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ఒక వాదన బలంగా ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తెలుగు సినీ పరిశ్రమకు ఇష్టం లేదంటూ వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ 30 ఇయర్స్ పృధ్వీ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత టాలీవుడ్ నుంచి ‘పెద్దలు, పెద్ద హీరోలు’ అనే వారు ఎవరూ జగన్‌ను కలవలేదు. దీంతో ఈ వాదన వినిపించింది. అయితే, తాజాగా సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ తర్వాత చిరంజీవి సతీసమేతంగా వెళ్లి అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి దంపతులను కలిశారు.

  Jagan chiranjeevi meeting, ganta srinivasa rao, rajyasabha seat for chiranjeevi, Cm ys jagan mohan reddy chiranjeevi meeting, ys jagan chiranjeevi meeting in Vijayawada, megafans unhappy with chiranjeevi ys jagan meeting, janasena, janasena party, ram charan meeting cm ys jagan, pawan kalyan angry on jagan chiranjeevi meeting, sye raa narasimha reddy tax exemption, ap cm ys jagan mohan reddy, ysrcp, megastar, ap news, ap politics, ap latest news, చిరంజీవి సీఎం జగన్ భేటీ, విజయవాడలో జగన్ చిరంజీవి భేటీ, చిరంజీవికి రాజ్యసభ సీటు, గంటా శ్రీనివాసరావు, చిరంజీవి జగన్ భేటీపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం, జనసేన, పవన్ కళ్యాణ్, సైరా నరసింహారెడ్డి, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
  సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ

  ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అమరావతి వెళ్లి సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లాలోని మహేష్ బాబు తండ్రి కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన అభివృద్ది పనుల గురించి భారతితో నమత్ర చర్చించారు. భవిష్యత్‌లో ప్రభుత్వం,గ్రామం ఫౌండేషన్ రెండు కలిసి బుర్రిపాలెం అభివృద్ది కోసం పనిచేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నమ్రత కలవడం అంటే మహేష్ బాబు వెళ్లినట్టుగానే భావించాలి.

  mahesh babu,namratha shirodkar,ys bharathi,ys jagan,namratha shirodkar meets ys bharathi,మహేష్ బాబు,నమత్ర శిరోద్కర్,వైఎస్ భారతి,వైఎస్ జగన్,వైసీపీ
  వైఎస్ భారతి,నమత్ర శిరోద్కర్

  చిరంజీవి, మహేష్ బాబు తర్వాత టాలీవుడ్‌ నుంచి జగన్‌ను కలిసేది ఎవరనే చర్చ సినీ ఇండస్ట్రీలో మొదలైంది. ఇకపై వరుసగా టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు జగన్‌ను కలవడానికి ఉత్సాహం చూపించనున్నారు. ఈ క్రమంలోనే ఆగిపోయిన నంది అవార్డుల పురస్కారాలను మళ్లీ కొనసాగించాలని నిర్ణయించాలని కోరే అవకాశం ఉంది.

  ధన్‌తేరస్ ఎందుకొచ్చింది.. బొమ్మల కథ..

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Mahesh Babu, Mahesh Babu Latest News, Megastar Chiranjeevi, Namratha Shirodkar, Ys bharathi

  ఉత్తమ కథలు