హోమ్ /వార్తలు /national /

రాజధాని మార్పు వెనుక వైసీపీ ప్లాన్ ఇదే... మళ్లీ తెరపైకి శివాజీ

రాజధాని మార్పు వెనుక వైసీపీ ప్లాన్ ఇదే... మళ్లీ తెరపైకి శివాజీ

సినీనటుడు శివాజీ

సినీనటుడు శివాజీ

అమరావతిని జగన్ కొనసాగించి ఉంటే ప్రజలు చంద్రబాబును మరిచిపోయేవారని శివాజీ అన్నారు. విశాఖలో వెయ్యి ఎకరాలు కూడా భూసేకరణ చేయలేరని, రాజధానితో విశాఖకు కూడా లాభమేమీ లేదని అభిప్రాయపడ్డారు.

  రాజధాని మార్పుపై ఎన్నికలకు ముందే వైఎస్ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని హీరో శివాజీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పెట్టిన డబ్బును తిరిగి సంపాదించుకునేందుకే రాజధాని మార్పు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కుల పిచ్చి ఉంటే... కమ్మవాళ్లున్న చోటే కియా మోటార్స్‌ పెట్టేవాళ్లు కదా అని ప్రశ్నించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే టీడీపీ నేతలను జైలులో పెట్టాలని సూచించారు. అమరావతికి అన్ని వర్గాల రైతులు భూములిచ్చారని, రాజధాని కోసం ఇప్పటికే రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టారని శివాజీ చెప్పారు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి తన రాజకీయ పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నారని శివాజీ అభిప్రాయపడ్డారు. అమరావతిని జగన్ కొనసాగించి ఉంటే ప్రజలు చంద్రబాబును మరిచిపోయేవారని అన్నారు. విశాఖలో వెయ్యి ఎకరాలు కూడా భూసేకరణ చేయలేరని, రాజధానితో విశాఖకు కూడా లాభమేమీ లేదని ఏబీఎన్‌ న్యూస్ ఛానల్‌తో ఇంటర్వ్యూలో శివాజీ స్పష్టం చేశారు.

  'వలంటీర్‌ ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే ఇచ్చామని విజయసాయిరెడ్డి అన్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదా?, హైకోర్టు వల్ల కర్నూలుకు పెద్దగా వచ్చే లాభమేమీ లేదు. రాజధానికి రూ.లక్ష కోట్లు అవసరం లేదు. అమరావతికి ఇప్పటివరకు ఖర్చుచేసిన... రూ.10వేల కోట్లు వృథా అయినా పరవాలేదా?, కేసుల భయంతోనే ప్రజలు ముందుకొచ్చి పోరాడటంలేదు. ఈ భయమే ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదా?, భవిష్యత్‌ తరాల కోసమైనా ఏపీ యువత పోరాడాలి. ఏపీ భవిష్యత్‌ ప్రమాదంలో పడిపోయింది. అయినా జనాలు ముందుకొచ్చి పోరాడటంలేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Amaravathi, Ap cm ys jagan mohan reddy, Shivaji

  ఉత్తమ కథలు