హోమ్ /వార్తలు /national /

దుబాయ్ విమానాశ్రయంలో నటుడు శివాజీకి షాక్

దుబాయ్ విమానాశ్రయంలో నటుడు శివాజీకి షాక్

నటుడు శివాజీ

నటుడు శివాజీ

శివాజీ మీద ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేవని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

    నటుడు శివాజీని దుబాయ్ విమానాశ్రయంలో అధికారులు నిలిపివేసినట్టు తెలిసింది. శివాజీ దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లాలని ప్రయత్నించగా, అక్కడి అధికారులు అడ్డుకున్నారు. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని సూచించారు. అయితే, శివాజీపై ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేవని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. అయితే శివాజీని దుబాయ్ ఎయిర్ పోర్టులో ఎందుకు నిలిపివేశారో తెలియదన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. శివాజీని గతంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. డిఫరెంట్ గెటప్‌లో విమానాశ్రయానికి వచ్చిన శివాజీని.. అధికారులు పాస్ పోర్టు చూసి గుర్తించారు. అప్పటికే ఆయన మీద అలంద మీడియా కేసు నడుస్తోంది. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. టీవీ 9 సీఈఓగా ఉన్నప్పుడు రవిప్రకాష్ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియాకు చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రవి ప్రకాష్ కొన్ని షేర్లు నటుడు శివాజీకి అమ్మినట్టు కూడా ప్రచారం జరిగింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Shivaji

    ఉత్తమ కథలు