హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rajinikanth:  జనవరిలో కొత్త పార్టీ.. ఆయన ఇంటికెళ్లి అశీర్వాదం తీసుకున్న రజనీకాంత్

Rajinikanth:  జనవరిలో కొత్త పార్టీ.. ఆయన ఇంటికెళ్లి అశీర్వాదం తీసుకున్న రజనీకాంత్

తన అన్న వద్ద ఆశీస్సులు తీసుకుంటున్న రజనీకాంత్(Image-Twitter/ANI)

తన అన్న వద్ద ఆశీస్సులు తీసుకుంటున్న రజనీకాంత్(Image-Twitter/ANI)

జనవరిలో కొత్త పార్టీ పెడతననాని స్పష్టం చేసిన ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్.. డిసెంబర్ 31న అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

జనవరిలో కొత్త పార్టీ పెడతననాని స్పష్టం చేసిన ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్.. డిసెంబర్ 31న అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రజనీకాంత్ వేగంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే పార్టీ ప్రకటనకు కంటే ముందుగానే ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్టర్ చేసేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ ప్రకటన నేపథ్యంలో ఆయన పలువురు సన్నిహితులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ తన అన్న సత్యనారాయణతో సమావేశమయ్యారు. ఆదివారం బెంగళూరులోని సత్యనారాయణ నివాసానికి వెళ్లిన రజినీకాంత్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

ఇక, కొత్త పార్టీకి పెట్టబోతున్న ప్రకటించిన రజనీకాంత్.. పార్టీ పర్యవేక్షుడిగా తమిళారివి మణియన్‌ను నిమిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల మణియన్‌ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. రాబోయే తమిళనాడు అసెంబ్లీ రజనీకాంత్ పార్టీ మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ద్వేష రాజకీయాలను భిన్నంగా తామ విధానాలు స్పిర్చువల్‌గా ఉంటాయని తెలిపారు. తాము ఎవరిని నిందించడం లేదని స్పష్టం చేశారు. ఇక, రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనుండటంపై ఆయన అభిమానులు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, రజనీకాంత్ ప్రకటనతోతో తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. రజనీ ఎంట్రీతో తమకు కలిగే లాభ నష్టాలపై పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో రజనీ ఒంటరిగానే బరిలో దిగుతాడా?, లేక ఏదైనా పార్టీతో జట్టుగా పోటీ చేస్తాడా? అనే దానిపై కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది.

First published:

Tags: Rajinikanth, Tamilnadu

ఉత్తమ కథలు