హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Yogi Adityanath: యోగిని కలిసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. కారణం ఏంటంటే..

Yogi Adityanath: యోగిని కలిసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. కారణం ఏంటంటే..

యూపీ సీఎం, కంగన రనౌత్

యూపీ సీఎం, కంగన రనౌత్

Uttar pradesh: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆదివారం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ని మర్యాదు పూర్వకంగా కలుసుకున్నారు.

Actor Kangana Ranaut Meets Yogi Adityanath: నటి కంగనా రనౌత్ ఆదివారం లక్నోలోని యోగి అధికారిక నివాసంలో ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టా ఖాతాలో కంగన పలు ఫోటోలను షేర్ చేశారు. కాగా, వీరిద్దరు గత ఏడాది అక్టోబరులో కూడా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కాగా, ఇటీవల యూపీలో జరిగిన ఎన్నికలలో మరోసారి విజయం సాధించినందుకు సీఎం యోగికి అభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది. కంగనా తన ఇన్ స్టాలో ఫోటోలు పంచుకుని.. శ్రీమతి రనౌత్ తన పోస్ట్‌కి క్యాప్షన్ చేస్తూ, "ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత మహారాజ్ యోగి ఆదిత్యనాథ్ జీని కలుసుకునే గొప్ప అదృష్టం ఈ రోజు నాకు కలిగింది.. ఇది ఒక అద్భుతమైన సాయంత్రం మహారాజ్ జీ యొక్క ఆశీర్వాస్సులు తీసుకున్నట్లు తెలిపింది. కాగా, గతంలో కూడా యూపీ సీఎం ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత.. కంగన యోగిని అభినందించారు.

Kangana Ranaut reveals she was molested in childhood:

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సినిమాల్లో తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మణికర్ణిక, తలైవీ తదితర అనేక సినిమాలలో నటించారు. తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు, ఉద్ధవ్ ఠాక్రెపై కూడా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కూడా మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకున్నారు. ఒక వైపు సినిమాలలో నటిస్తునే.. మరోవైపు లాకప్ రియాల్టీ షోకు కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భిన్నమైన కాన్సెప్ట్ లతో ఈ షో ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించింది. దీనిలో కంటెస్టెంట్ తాము.. ఎదుర్కొన్న అనేక సంఘటనలను హోస్ట్ లతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో ఒక మునాఫర్ అనే కంటెస్టెంట్ తాను..చిన్న తనంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని హోస్ట్ లకు చెప్పుకున్నాడు. తెలిసిన వారే.. ఐదేళ్ల పాటు నరకం చూపించారని తన బాధను చెప్పుకున్నాడు. అయితే , ఈ క్రమంలో కంగనా రనౌత్ ఎమోషనల్ అయ్యారు. తాను చిన్న తనంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు.

కంగాన తన లైంగిక వేధింపుల గురించి చెబుతూ.. తాను ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. తమ గ్రామంలోని ఒక బాలుడు.. తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. అతను తమకన్నా.. కేవలం నాలుగేళ్లు పెద్దవాడని తెలిపింది. ఇంటిదగ్గర స్నేహితులతో కలిసి ఆడుకునేటప్పుడు మధ్యలో వచ్చేవాడు. ఆ తర్వాత.. శరీరాన్ని తాకుతూ.. అసభ్యంగా ప్రవర్తించేవాడు.అప్పుడు చిన్న తనంలో అతగాడి ఉద్దేష్యం తమకు తెలిసేది కాదని బాధపడింది. అప్పటి దారుణ ఘటనను ప్రస్తుతం మరోసారి కంగన గుర్తు చేసుకుంది.

First published:

Tags: Kangana Ranaut, UP Assembly Elections 2022, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు