హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi-AAP: ప్రధాని మోదీ వ్యాట్ వ్యాఖ్యలకు ఆప్ కౌంటర్.. ఇదీ లెక్క అంటూ లేఖ

PM Modi-AAP: ప్రధాని మోదీ వ్యాట్ వ్యాఖ్యలకు ఆప్ కౌంటర్.. ఇదీ లెక్క అంటూ లేఖ

నరేంద్రమోదీ, కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

నరేంద్రమోదీ, కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

PM Modi-AAP: ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి వ్యాట్ కంటే కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం ఎక్కువ అని ఆప్ ట్రేడ్ వింగ్ ఈ లేఖలో పేర్కొంది.

దేశంలో రోజురోజుకు పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. CNG, LPG ధరలు కూడా పూర్తిగా మండుతున్నాయి. ఈ ధరలను తగ్గించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్ రేట్లపై రాజకీయాలు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ రేట్లను తగ్గించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కొద్దిరోజుల క్రితం అసహనం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు వీటినే ప్రధాన కారణమని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని వ్యాఖ్యలపై దాడికి దిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనపై ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ  (AAP) స్పందించింది. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ లేఖ రాస్తూ పరిస్థితిని తెలియజేసింది. ఈ విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ ట్రేడ్ వింగ్ కన్వీనర్ బ్రిజేష్ గోయల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోలు, (Petrol)  డీజిల్ (Diesel)  ధరలు పెరగడానికి వ్యాట్ కంటే కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం ఎక్కువ అని ఆప్ ట్రేడ్ వింగ్ ఈ లేఖలో పేర్కొంది.

2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైందని బ్రిజేష్ గోయల్ గణాంకాలు ఇస్తూ చెప్పారు. అప్పట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 105.60 డాలర్లు ఉండగా, నేడు బ్యారెల్‌కు 105.44 డాలర్లుగా ఉందని అన్నారు. మధ్యలో బ్యారెల్ ధర 80 డాలర్లకు పడిపోయిందని.. ఇంత చేసినా ప్రజలకు చౌకగా పెట్రోల్, డీజిల్ లభించలేదని అన్నారు. 2014లో పెట్రోలు లీటరుకు రూ.61.37 ఉండగా, నేడు రూ.105.41గా ఉందని పేర్కొన్నారు. 2014లో ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై 20 శాతం వ్యాట్‌ను విధించేదని, ఇప్పుడు అది 19.40 శాతానికి తగ్గిందని గోయల్ లేఖలో ప్రస్తావించారు.

అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం 2014లో పెట్రోల్‌పై లీటర్‌పై రూ.9 ఎక్సైజ్ సుంకం వసూలు చేసిందని.. నేడు లీటరుకు రూ.27.90గా ఉందని ఆరోపించారు. ఎక్సైజ్ సుంకాన్ని 210 శాతం పెంచారని తెలిపారు. 2014లో లీటరు డీజిల్ రూ.50.51 ఉండగా, నేడు రూ.96.67గా ఉంది. 2014లో ఢిల్లీ ప్రభుత్వం డీజిల్‌పై 12.50 శాతం వ్యాట్‌ను విధించింది. నేడు 16.75 శాతం వ్యాట్. 2014లో కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై లీటరుకు రూ.3.50 ఎక్సైజ్ సుంకం విధించింది.

Hindi row: హిందీ రానివాళ్లంతా విదేశీయులే.. భారత్ విడిచి వెళ్లండి: బీజేపీ అనుబంధ యూపీ మంత్రి వార్నింగ్

Shocking : దండం పెడతా,ప్లీజ్ అని వేడుకుంటున్నా..యువకుడిని తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చావబాదారు

ఈరోజు లీటరుకు రూ.21.80 ఎక్సైజ్ సుంకం విధిస్తున్నారు.అంటే డీజిల్‌పై 522 శాతం ఎక్సైజ్ సుంకం పెంచారు. ప్రస్తుతం పెట్రోల్‌ అసలు ధర లీటరుకు రూ.56.52గా ఉందని.. దీనిపై రూ.3.86 డీలర్ కమీషన్, రూ. 17.13 వ్యాట్, రూ. 27.90 ఎక్సైజ్ సుంకం వర్తిస్తుందని.. అందుకే వినియోగదారుడికి రూ.105.41కి పెట్రోలు లభిస్తోందని ట్రేడ్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌ సుభాష్‌ ఖండేల్‌వాల్‌, జనరల్‌ సెక్రటరీ విష్ణు భార్గవ తెలిపారు. డీజిల్ వాస్తవ ధర లీటరుకు రూ.58.16గా ఉందని.. దీనిపై డీలర్ కమీషన్ రూ.2.59, వ్యాట్ రూ.14.12, ఎక్సైజ్ సుంకం రూ.21.80.. రూ.96.67కి వినియోగదారుడికి డీజిల్ లభిస్తోందని తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు మూలం ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ కాదని ప్రధాని అర్థం చేసుకోవాలని సూచించారు.

First published:

Tags: AAP, Pm modi

ఉత్తమ కథలు