హోమ్ /వార్తలు /national /

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ కొత్త పంథా మామూలుగా లేదుగా.. పార్టీ మారితే ఓటర్లే కేసు పెట్టే అవకాశం..

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ కొత్త పంథా మామూలుగా లేదుగా.. పార్టీ మారితే ఓటర్లే కేసు పెట్టే అవకాశం..

గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల(Goa Assembly Elections) సమయంలో అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాలు అందరికీ గుర్తు ఉండే ఉంటాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని సీట్లను భాజపా గెలుచుకోకపోయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నాయి. అందరి దృష్టి పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌(Uttara Pradesh)పైనే ఉంది. అయితే చిన్న రాష్ట్రమైన గోవాలో(Goa) కూడా ఈసారి ఎలక్షన్(Election) ఫీవర్ పెద్ద స్థాయిలోనే ఉంది. ఈ రాష్ట్రంలో చిన్న పార్టీలు(Parties) ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పక్షాన చేరడం ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. దీంతో ఇలాంటి పోకడలకు చెక్ పెట్టేందుకు కొత్త మార్గాన్ని అవలంభిస్తున్నారు ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. తమ పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలకు మారే ఎమ్మెల్యేలపై ప్రజలు కేసు పెట్టే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

  YCP MLA: కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికార పార్టీ నేతల్లోనే అసంతృప్తి.. మరి సీఎం ఏం చేస్తారో..?

  గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల(Goa Assembly Elections) సమయంలో అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాలు అందరికీ గుర్తు ఉండే ఉంటాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని సీట్లను భాజపా గెలుచుకోకపోయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అవసరమైన బలాన్ని సంపాదించడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, స్వతంత్ర ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించింది. ఎట్టకేలకు ఫిరాయింపులు ఫలించి కాంగ్రెస్‌ అధికార అవకాశాలకు గండి కొట్టి అధికార పీఠాన్ని చేజిక్కించుకొంది. అయితే ఓటర్ల నిర్ణయాన్ని కాదనే తరహాలో అధికారం చెలాయించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

  వీటిని ఆధారంగా చేసుకొనే ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aap) అధినేత ఈ ఎన్నికల్లో కొత్త పంథా ఎంచుకొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో (MLA Candidates) ఫిరాయింపులకు పాల్పడమని అఫిడవిట్లపై సంతకం చేయించారు. గోవాలో ఎన్నికైన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలలో చేరితే స్థానిక ఓటర్లు(Voters) వారిపై న్యాయపరమైన చర్యలు (Sue) తీసుకొనే అవకాశం కల్పిస్తున్నామని ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఇతర పార్టీలలో చేరమని, ఆయన అభ్యర్థులతో అఫిడవిట్లపై(Affidavit) సంతకాలు చేయించారు. దీనిపై ఆయన గోవాలో జరిగిన ఓ పత్రిక సమావేశంలో మాట్లాడారు.

  BalaKrishna: ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన బాలయ్య.. రేపు హిందూపురంలో మౌనదీక్ష

  తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీల వైపు చూడరని నమ్మతున్నామన్నారు. గోవాలో రాజకీయాలు సక్రమంగా లేవని, కలుషితమై పోయాయయని, ఈ పరిస్థితుల్లో ప్రజలు తమను పార్టీ ఫిరాయింపులపై ప్రశ్నించడంలో తప్పులేదన్నారు. అందుకే అభ్యర్థులతో అఫిడవిట్లపై సంతకాలు చేయించామని చెప్పారు. గోవాలో ప్రతి ఇంటి ముందుకూ వెళ్లి ఈ విషయాన్ని చెబుతున్నామన్నారు. ఆప్‌ ఎమ్మెల్యేలు ప్రజలు, పార్టీ నిర్ణయాన్ని పక్కనపెడితే న్యాయపరమైన చర్యలు తీసుకొనే వీలు కల్పిస్తున్నామని చెప్పారు. తమను మోసం చేసినట్లు ప్రజలు కేసు పెట్టవచ్చన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు లేదనే విషయంపై సంకేతాలు ఇచ్చారు.

  First published:

  Tags: AAP, Arvind Kejriwal, Goa, Politics

  ఉత్తమ కథలు