హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఉచిత హామీలతో ఆర్థిక వ్యవస్థ పతనం.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వ్యాఖ్యలు

ఉచిత హామీలతో ఆర్థిక వ్యవస్థ పతనం.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్డు (Image Credit:PTI)

సుప్రీంకోర్డు (Image Credit:PTI)

ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల మీద కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీలతో భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.

దేశంలో ఇప్పుడో పెద్ద సంచలనానికి దారి తీసింది ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం, రాష్ట్ర, దేశ పరిస్థితులను పట్టించుకోకుండా ప్రజలకు ఇచ్చే ఇబ్బడిముబ్బడిగా ఇచ్చే ఉచిత హామీల మీద దాఖలైన ఈ వ్యాజ్య విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీల ఉచిత హామీలు, వాటి పర్యవసానాలకు సంబంధించి దాఖలైన పిల్ మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఉచితాలు ఇస్తూ పోతే రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పతనానికి దారి తీస్తుంది.’ అని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ పిల్ మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. దీనిపై గతంలో జూలై 26న కేంద్ర ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం వివరణ కోరింది. అయితే, ఎన్నికల కమిషన్ మాత్రం అది కేంద్రం ప్రభుత్వం చెప్పాలంటూ బాల్ ను కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టింది. దీంతో సుప్రీంకోర్టు భారత ప్రభుత్వం నుంచి వివరణ కోరింది.  అలాగే నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ నుంచి వివరణ కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం ఉచితాలతో ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము ఆ ప్రజా ప్రయోజనవ్యాజ్యానికి మద్దతిస్తామని, ఉచితాల వల్ల భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు నష్టమని స్పష్టం చేశారు.

అసలు ఈ పిల్ ఏంటి? దాని కథేంటి? టాప్ 10 పాయింట్లు

జనవరి 22: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు ఉచిత హామీలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలైంది. ప్రజల డబ్బులు ఇలా ఇష్టం వచ్చినట్టు ఉచితాల పేరుతో పంచడం సరికాదని, ఇలాంటి హామీల వల్ల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రభావితం అవుతుందని స్పష్టం చేసింది.

బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వని కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. ఉచిత హామీలు ఇవ్వడం ద్వారా రాజకీయ పార్టీలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 162, 266(3), 282ని ఉల్లంఘించినట్టేనని చెప్పారు. ప్రజా ధనంతో ఇలా ఇష్టా రీతిన ఉచితాలు పంచుతామని హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని కోరారు. పంజాబ్‌లో అధికారంలోకి రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చాలంటే నెలకు రూ.12,000 కోట్లు ఖర్చవతుందని అందులో పేర్కొన్నారు. అలాగే, శిరోమణి అకాలీదళ్ ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చాలంటే నెలకు రూ.25,000, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చాలంటే రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.30,000 కోట్ల ఖర్చు వస్తుందన్నారు. అయితే, రాష్ట్రానికి నెలకు వచ్చే జీఎస్టీ కేవలం 1400 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు.

జనవరి 25: ఉచిత హామీలను విబేధిస్తూ దాఖలైన పిల్ మీద వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు నోటీసులు ఇచ్చింది.

ఏప్రిల్ 9: ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఉచిత హామీలు అనేవి రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలని, దీనిపై రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్ చేతులు దులుపుకొంది.

జూలై 3: గుజరాత్‌లో పర్యటించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం ఇస్తే ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించారు. గుజరాత్‌లో అవినీతిని అంతం చేస్తే ఉచిత కరెంటుపెద్ద కష్టం కాదని అన్నారు. తాము ఢిల్లీలో అమలు చేసి చూపిస్తున్నామని స్పష్టం చేశారు.

జూలై 16: ఉచిత హామీలు ఇచ్చుకుంటూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉచితాల మీద అప్రమత్తంగా ఉండాలన్నారు.

First published:

Tags: Bjp, Gujarat, Supreme Court

ఉత్తమ కథలు