మూడో దశ సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 116 ఎంపీ స్థానాల్లో మూడో దశ పోలింగ్ జరగనుంది. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చెరో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మూడో దశ పోలింగ్ లో కేరళ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, కేంద్ర మంత్రి సంతోష్ గాంగ్వర్ పోటీ చేయనున్నారు. ఇక మూడోదశ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ కూడా ఈ దశలో కీలకంగా మారనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Gujarat Lok Sabha Elections 2019, Kerala Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Rahul Gandhi, Wayanad S11p04, West Bengal Lok Sabha Elections 2019