హోమ్ /వార్తలు /national /

ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకూ హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్... అసలు కారణాలు ఇవీ...

ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకూ హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్... అసలు కారణాలు ఇవీ...

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు

తెలంగాణలోని మొత్తం 16 ఎంపీ సీట్లను హస్తగతం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసింది.

లోక్‌సభ ఎన్నికలతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల దాఖలుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తెలంగాణలోని మొత్తం 16 ఎంపీ సీట్లను హస్తగతం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసింది. టీఆర్ఎస్ తరపున పోటీ పడే అభ్యర్థుల జాబితాను... ఆ పార్టీ అధినేత కేసీఆర్ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గురువారం గులాబీ బాస్ లిస్ట్ ప్రకటించనున్నారు. అయితే ఈ జాబితాలో ముగ్గురు సిట్టింగులకు టీఆర్ఎస్ అధిష్టానం షాకిచ్చినట్లు సమాచారం. ముగ్గురు నేతలకు టికెట్ ఇవ్వలేమని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్ లకు ఈ సారి టికెట్ లభించబోదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా వారికి చెప్పినట్లుగా సమాచారం.

ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పొంగులేటి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన నామా నాగేశ్వరరావుకు ఇవ్వనున్నాట్లు తెలుస్తోంది. ఇక చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అక్కడి నుంచి పోటీకి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి పేరు ఖరారైనట్టు సమాచారం. మొత్తం మీద టీఆర్ఎస్ ఎంపీల అభ్యర్థుల జాబితాలో సగం మంది కొత్తవారే ఉంటారని సమాచారం. ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో గురువారం మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆ జాబితాను విడుదల చేయనున్నారు. ఎంపీ అభ్యర్థుల వడపోత ప్రక్రియ నెల రోజుల నుంచి కొనసాగుతండగా దీనిపై బుధవారం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు.

First published:

Tags: CM KCR, Lok Sabha Election 2019, Telangana Election 2018, Telangana News, Trs

ఉత్తమ కథలు