Coal Shortage : "బొగ్గు కొరత లేదన్న కేంద్రమంత్రి" ఆక్సిజన్ కొరత లేదని కూడా ఇలాగే చెప్పారు... ఢిల్లీ మంత్రి ఫైర్
(ప్రతీకాత్మక చిత్రం)
Coal war : బొగ్గు కొరతపై మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రాజుకుంటుంది. బొగ్గు కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే అదేం లేదంటూ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. దీంతో కరోనా
టైంలోకూడా ఆక్సిజన్ కొరత లేదంటూ ఊదరగొట్టారంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కేంద్రానికి చురకలు అంటించారు.
కేంద్రం వద్ద మూడు నాలుగు రోజులకు మినహ బొగ్గు ( coal crisis ) నిల్వలు లేవని దీంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడబోతుందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ముఖ్యంగా బొగ్గు కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలకు బొగ్గు పంపిణీ చేయాలని తన లేఖలో ఆయన కోరారు.
అయితే బొగ్గు కొరత పై కేంద్రమంత్రి విద్యుత్ శాఖ మంత్రి ఆకే సింగ్ స్పందించారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడడంతో విద్యుత్ సంక్షోభం (Power crisis in India) ఎదుర్కోబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. విద్యుత్ సంక్షోభంపై(Power crisis in India) అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని స్పష్టం చేశారు. కేవలం గెయిల్ (GAIL), డిస్కం సంస్థల మధ్య సమాచారలోపం వల్లే ఇలాంటివి ఏర్పడినట్లు పేర్కొన్నారు.
దేశరాజధాని దిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏర్పడనున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్(RK singh news) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విపక్షాలే వదంతులు సృష్టిస్తూ.. రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
అయితే ఈ ప్రకటనపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు. ఏప్రిల్, మే నెలల్లో దేశంలో క్సిజన్ కొరత ఏర్పడిన సమయంలో కూడా కేంద్రం ఇలాగే మాట్లాడిందని సిసోడియా విమర్శించారు. అప్పుడు ఆక్సిజన్ కొరత లేదన్నారు. ఇప్పుడు బొగ్గు కొరత లేదంటున్నారు. మా ముఖ్యమంత్రి లేఖ రాసుండకూడదంటూ ఈ సంక్షోభాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సిసోడియా ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరోవైపు గుజరాత్, పంజాబ్. రాజస్థాన్. ఢిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాలు బ్లాకవుట్ ఆందోళనలు లేవనెత్తాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలకు బొగ్గు సరఫరా జరిగేలా చూడాలని కోరారు. ఈ బొగ్గు కొరత కారణంగా బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రోజుకు 14 గంటలపాటు కరెంటు కోతలు విధిస్తున్నారు.
అయితే దీనికి కారణం బొగ్గు కొరత కాదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఎకానమీ పునరుద్ధరణతో పెరిగిన ఎలక్ట్రిసిటీ డిమాండ్, బొగ్గు గనుల ప్రాంతాల్లో భారీ వర్షాలు, బొగ్గు దిగుమతి ధరలు పెరగడంతోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బొగ్గు కంపెనీలు భారీ రుణాల్లో ఉండటం వంటి కారణాల వల్లే పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయని ప్రభుత్వం తెలిపింది.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.