తమిళనాడులో ఐటీ దాడులు... చంద్రబాబు టార్గెట్‌గా చేయించారా...

Lok Sabha Election 2019 : ఈసారి లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తీరును చూస్తే... పైకి ప్రశాంతంగా... లోపల ఎన్నో ఎత్తుగడలతో జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 16, 2019, 6:10 PM IST
తమిళనాడులో ఐటీ దాడులు... చంద్రబాబు టార్గెట్‌గా చేయించారా...
ప్రతీకాత్మక చిత్రం (File)
  • Share this:
లోక్ సభ ఎన్నికల రెండో దశలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉండగా... ఆ రెండు రాష్ట్రాలపైనా ఐటీ అధికారులు దాడులతో విరుచుకుపడ్డారు. ప్రధానంగా బీజేపీకి ప్రత్యర్థి పార్టీల నేతల ఇళ్లు, కార్యాలయాలపైనే ఈ దాడులు జరిగాయన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో... అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో... బీజేపీ చేతులు కలపడంతో... ఈ రెండు పార్టీలకూ ప్రత్యర్థిగా ఉన్న డీఎంకే నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని మాండ్య, హసన్‌లలో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ఈ రెండుచోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి. మాండ్య, హసన్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు యత్నిస్తున్నారంటూ ఐటీ అధికారులు దాడులు చేశారు.

మాండ్యలో జేడీఎస్ అభ్యర్థిగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచీ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన సుమలతకు బీజేపీ మద్దతిస్తోంది. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా మాండ్య, హసన్ నియోజక వర్గాల్లోని ఓటర్లను జేడీయూ, కాంగ్రెస్ కూటమి ప్రలోభపెడుతోందని ఆరోపిస్తుంటే... అక్కడి జేడీఎస్, కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే నేతల ఇళ్లల్లోనూ ఐటీ అధికారుల దాడులు అర్థరాత్రి వరకు కొనసాగాయి. చెన్నైలోని మంత్రులు ఉదయ్ కుమార్, రాధాకృష్ణన్ ఇళ్లల్లో తనిఖీలు చేశారు. బెంగళూరు, చెన్నై నగరాల్లో ఈ దాడులు చేశారు. ఐతే... అన్నాడీఎంకే కంటే... డీఎంకే నేతలే దాడుల అసలు టార్గెట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ, అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల బరిలో దిగగా... కాంగ్రెస్, డీఎంకేకు మద్దతిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకేపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందనీ, డీఎంకేకి లోక్ సభ ఎన్నికలు కలిసొస్తాయనే ప్రచారం సాగుతోంది. అందువల్ల డీఎంకేను నిలువరించేందుకూ, ఎన్నికల్లో డబ్బులు పంచకుండా అడ్డుకునేందుకూ ఈ దాడులు చేయించినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం టీడీపీ, డీఎంకేకు మద్దతిస్తోంది. ఈ రెండు పార్టీలకూ ఉమ్మడి శత్రువుగా బీజేపీ ఉంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ముందు వరకూ ఇలాంటి చాలా దాడులు జరిగాయి. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలోనే... తమిళనాడులో కూడా దాడులు జరగడంతో... రాజకీయ కలకలం రేగింది. తన ప్రచారంలో బీజేపీపై మండిపడిన చంద్రబాబు... స్వతంత్ర సంస్థల్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని కేంద్రంపై విమర్శలు చేశారు.ఇవి కూడా చదవండి :

మాయావతి షూస్ పాలిష్ చేసేలా చేస్తాను... మరో వివాదంలో అజంఖాన్...

సుమలత ఫేస్‌బుక్ అకౌంట్ బ్లాక్ చేశారట... ఆమె ఏం చేశారంటే...

వారణాసి నుంచీ బరిలో ప్రియాంక గాంధీ... నరేంద్ర మోదీని ఓడించబోతున్నారా...


పెళ్లైన 20 ఏళ్ల తర్వాత పుట్టిన పాప... నోట్ల వర్షం కురిపించిన బిజినెస్ ఫ్యామిలీ...
Published by: Krishna Kumar N
First published: April 16, 2019, 6:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading