రాజకీయాల్లోకి మరో స్పోర్ట్స్ స్టార్ ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగట్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర క్రీడల కిరణ్ రిజుజు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బబితతో పాటు ఆమె తండ్రి మహవీర్ సింగ్ ఫొగట్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని హర్యానాలో భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. బీజేపీ చేరిన అనంతరం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. వారికి నడ్డా కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బబిత యూత్ ఐకాన్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
Delhi: Wrestler Babita Phogat and her father Mahavir Singh Phogat meet BJP Working President JP Nadda, after joining the party. pic.twitter.com/GYOVO1NFjc
జమ్మూకశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం గొప్ప పని చేసింది. ఆర్టికల్ 370ని రద్దుచేసి చరిత్ర సృష్టించింది. నేను ప్రధాని మోదీకి పెద్ద అభిమానిని.
— బబిత
29 ఏళ్ల బబిత అర్జున అవార్డు గ్రహీత. ప్రస్తుతం హర్యానాలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన నేపథ్యంలో ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కశ్మీరి యువతుల పట్ల హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. ఐతే ఫొగట్ మాత్రం ఆయనను సమర్థించారు. సీఎం ఎలాంటి తప్పు మాట్లాడలేదని..ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని విమర్శించారు. కాగా, హర్యానాలో ఈ ఏడాది ఆఖర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో బబిత చేరికతో పార్టీ మరింత పటష్టమవుతుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.