'ప్రియాంకను మీ చేతుల్లో పెడుతున్నా...జాగ్రత్తగా చూస్కోండి': రాబర్ట్ వాద్రా భావోద్వేగం

ప్రియాంక గాంధీ ప్రజాక్షేత్రంలోకి దిగిన నేపథ్యంలో ఆమెపై భర్త రాబర్ట్ వాద్రా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక పరిపూర్ణ మహిళంటూ ఆకాశానికెత్తారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు వాద్రా. ప్రియాంక గాంధీని మీ చేతుల్లో పెడుతున్నానని..ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ..ఉత్తర ప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: February 11, 2019, 8:48 PM IST
'ప్రియాంకను మీ చేతుల్లో పెడుతున్నా...జాగ్రత్తగా చూస్కోండి': రాబర్ట్ వాద్రా భావోద్వేగం
రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ(File)
news18-telugu
Updated: February 11, 2019, 8:48 PM IST
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా..ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిపెట్టింది కాంగ్రెస్. దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలున్న యూపీలో పైచేయి సాధిస్తే.. అధికార పగ్గాలు సులభంగా చేజిక్కించుకోవాలన్నది రాహుల్ ప్లాన్..! అందులో భాగంగా సోదరి ప్రియాంక గాంధీ ఈస్ట్ యూపీ బాధ్యతలను అప్పగించిన రాహుల్.. యోగి ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చెల్లెలు ప్రియాంక గాంధీతో కలిసి లక్నోలో రోడ్ షో నిర్వహించారు. తూర్పు ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ప్రియాంక. ఎయిర్‌పోర్టు నుంచి పార్టీ కార్యాలయం వరకు జరిగిన మెగా రోడ్ షోకు కాంగ్రెస్ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం యూపీ రాజకీయాల్లో ప్రియాంగ గాంధీ పేరే మార్మోగిపోతోంది.

ఐతే ప్రియాంక గాంధీ ప్రజాక్షేత్రంలోకి దిగిన నేపథ్యంలో ఆమెపై భర్త రాబర్ట్ వాద్రా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక పరిపూర్ణ మహిళంటూ ఆకాశానికెత్తారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు వాద్రా. ప్రియాంక గాంధీని మీ చేతుల్లో పెడుతున్నానని..ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ..దేశ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడా ఫేస్‌బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ప్రియాంకకు నా బెస్ట్ విషెస్. ప్రియాంక నాకు మంచి స్నేహితురాలే కాదు..సంపూర్ణ భార్య. మా పిల్లలకు అత్యుత్తమ తల్లి. అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దుర్మార్గపు, విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవ చేయడాన్ని ఆమె బాధ్యత. ప్రియాంకను దేశ ప్రజల చేతుల్లో పెడుతున్నాను. మీరే జాగ్రత్తగా చూసుకోండి.
రాబర్ట్ వాద్రాప్రస్తుతం ప్రియాంక గాంధీ లక్నోలో పర్యటిస్తుండగా..వాద్రా రాజస్థాన్‌లో ఉన్నారు. బికనేర్‌లో ఓ భూకంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణ కోసం తల్లితో కలిసి జైపూర్‌కు వెళ్లారు. జైపూర్‌కి వెళ్లేముందు ఢిల్లీలో బైక్ నడిపారు వాద్రా. ప్రియాంక లక్నో పర్యటనపై విలేఖరులు ప్రశ్నలడగా.. స్పందించేందుకు నిరాకరించారు. కాగా, గత వారం రాబర్ట్ వాద్రాను వరుసగా మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. విదేశాల్లో ఆస్తుల కొనుగోలు కోసం మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి.

గ్యాలరీ: రాహుల్ గాంధీతో కలిసి లక్నోలో ప్రియాంక గాంధీ మెగా రోడ్ షో

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...