mp : మాస్క్ సరిగా వేసుకోలేదని యువకున్ని చితకబాదిన పోలీసులు..చివరకు ఎమైంది..

పోలీస్ జులుం ; మాస్క్ సరిగా వేసుకోలేదని ఓ యువకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు వైరల్ గా మారింది. మాస్క్ వేసుకోకపోవడంతో తమ మాట కూడ వినడం లేదంటూ ఆ యువకున్ని పోలీసులు నడిరోడ్డు మీద క్రింద పడేసి చితకబాదారు

పోలీస్ జులుం ; మాస్క్ సరిగా వేసుకోలేదని ఓ యువకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు వైరల్ గా మారింది. మాస్క్ వేసుకోకపోవడంతో తమ మాట కూడ వినడం లేదంటూ ఆ యువకున్ని పోలీసులు నడిరోడ్డు మీద క్రింద పడేసి చితకబాదారు

  • Share this:
మాస్క్ సరిగా వేసుకోలేదని ఓ యువకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు వైరల్ గా మారింది. మాస్క్ వేసుకోకపోవడంతో తమ మాట కూడ వినడం లేదంటూ ఆ యువకున్ని పోలీసులు నడిరోడ్డు మీద క్రింద పడేసి చితకబాదారు. నడిబజార్లో పోలీసులు చేసిన హంగామా సోషల్ మీడీయాలో చక్కర్లు కొట్టడడంతో ఉన్నతాధికారులు వారిపై చర్యలకు ఉపక్రమించారు..ఇందుకోసం భాద్యులపై పోలీసులను సస్పెండ్ చేశారు.

మధ్యప్రదేశ్ లోని క్రిష్ణ కేయర్ అనే మధ్యవయస్కుడు ఆటో డ్రైవర్ .అయితే తన ఆటోలో కుమారున్ని తీసుకుని ఆస్సత్రిలో చికిత్స పోందుతున్న తన తండ్రి వద్దకు భోజనం తీసుకుని వెళుతున్నాడు. దీంతో కరోనా నేపథ్యంలో చర్యలు చేపట్టిన బోపాల్ పోలీసులు క్రిష్ణ కేయర్ ను ఆపారు. అయితే అదే సంధర్భంలో ముక్కు పై ఉండాల్సిన మాస్క్ సరిగా లేకపోవడంతో ప్రశ్నించారు. దీంతో స్టేషన్ కు రావాలని హుంకరించారు. ఆస్పత్రి పాలైన తండ్రి వద్దకు వెళ్తున్నానని చెప్పినా వినక పోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చేసుకున్నట్టు భాదితుడు చెప్పాడు. దీంతో పోలీసులు ఆయన్ని ఇష్టం వచ్చినట్టు చితకబాదారు. కాగా నడి రోడ్డుపై సంఘటన జరగడంతో ప్రయాణికులు ఆ సంఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Published by:yveerash yveerash
First published: