• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • POLICE TRACK AUTO VIA CCTV RECOVER VALUABLES WORTH RS 75000 LEFT BY WOMAN SK

ఆటోలో డబ్బు, బంగారం మర్చిపోయిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగింది? అచ్చం సినిమానే

ఆటోలో డబ్బు, బంగారం మర్చిపోయిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగింది? అచ్చం సినిమానే

ప్రతీకాత్మక చిత్రం

ముంబైకి చెందిన ఆయేషా ఖాన్ (25) ఫిబ్రవరి 25న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. జోగేశ్వరి వెస్ట్‌లోని హిల్ రాక్ సొసైటీలో ఆటో దిగి బంధువుల ఇంటికి వెళ్లింది. కాసేపటి ఆ తర్వాత డబ్బుల కోసం పర్సును వెతికితే అది కనిపించలేదు.

  • Share this:
    హడావిడిలో చాలా మందికి మతిమరుపు రావడం సహజమే. కంగారులో తాము తీసుకెళ్లాల్సిన వస్తువులను మరిచిపోతుంటారు. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేటప్పుడు.. బైక్ కీ, పర్సు పోవడం సహజంగా చూస్తుంటాం. అంతేకాదు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు బస్సులు, రైళ్లలో బ్యాగులను కూడా మరిచిపోయే వారు చాలా మందే ఉన్నారు. ముంబైలో ఓ మహిళ ఇలాగే ఓ ఆటోలో బంగారంతో పాటు డబ్బు మరిచిపోయింది. దిగి ఇంటికి వెళ్లి చూసుకుంటే.. డబ్బు లేదు. బంగారమూ కనిపించలేదు. వామ్మో.. అన్నీ పోయాయని కంగారుపడిన ఆ మహిళ.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాతే అసలు కథ మొదలయిది. అచ్చం సినిమాలో చూపించినట్లుగానే జరిగింది.

    ముంబైకి చెందిన ఆయేషా ఖాన్ (25) ఫిబ్రవరి 25న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. జోగేశ్వరి వెస్ట్‌లోని హిల్ రాక్ సొసైటీలో ఆటో దిగి బంధువుల ఇంటికి వెళ్లింది. కాసేపటి ఆ తర్వాత డబ్బుల కోసం పర్సును వెతికితే అది కనిపించలేదు. ఆమె ఎంతో కంగారుపడిపోయింది. ఇళ్లంతా వెతికినా దొరకలేదు. పర్సు మాత్రమే కాదు.. బంగారం కూడా పోయినట్లు గ్రహించింది. 25వేల నగదుతో పాటు 50 వేల విలువైన బంగారం గాజు, ఐడీ కార్డులు ఆటోలోనే మరిచిపోయానని తెలసుకుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

    ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ప్రయాణించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించి.. ఆటో రిజిస్ట్రేషన్ నెంబరు గుర్తించారు. ఆ నెంబర్ ఆధారంగా ఆర్టీఏ అధికారులను సంప్రదించి.. ఆటో డ్రైవర్ వివరాలను సేకరించారు. అనంతరం అతడికి ఫోన్ కాల్ చేసిన జరిగిన విషయం చెప్పారు. అవును సార్.. మా ఆటోలోనే డబ్బులు, బంగారం గాజు ఉందని డ్రైవర్ వివరించాడు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆ మహిళకు సంబంధించిన వస్తువులను అప్పగించాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే తన డబ్బు, బంగారం తిరిగి దొరకడంతో ఆమె ఎంతో సంతోషపడింది. పోలీసులతో పాటు ఆటో డ్రైవర్‌కు కూడా థ్యాంక్స్ చెప్పింది.
    Published by:Shiva Kumar Addula
    First published: