ఎవరైన తప్పిపోతే పోలీస్టేషన్ (Police Station) కు వెళ్తారు. అసలు పోలీస్టేషన్ తప్పిపోతే ఏం చేస్తారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. సెంటర్‌లోని క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్ (CCTNS) కింద అన్ని నోటిఫైడ్ పోలీస్ స్టేషన్‌లలో CCTV కెమెరాలు అమర్చుతున్నారు. అయితే సీసీ కెమెరాలు అమర్చడంలో పోలీసులకు షాక్ తినే వాస్తవాలు కనిపించాయి. 28 జిల్లాల్లో CCTV కెమెరాను అమర్చడానికి ప్రయత్నిస్తున్న పోలీస్‌లకు 62 పోలీసు స్టేషన్‌లు, 37 పోలీసు అవుట్ పోస్టులను గుర్తించ లేకపోయారు. దీంతో ఖంగుతినడం పోలీసుల వంతు అయ్యింది. దీంతో ఏం ఆగమేఘాలమీద పోలీసులు వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో నేరనియంత్రణపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
Assembly Elections 2022: కాంగ్రెస్ రాతను చన్నీ మారుస్తారా.. పంజాబ్‌లో పార్టీ పరిస్థితి ఏంటీ?
అన్ని స్టేషన్‌లో సెంటర్‌లోని క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్ (CCTNS) కింద అన్ని నోటిఫైడ్ పోలీస్ స్టేషన్‌లలో CCTV కెమెరాలు అమర్చుతున్నారు. రాష్ట్రంలో 925 పోలీస్ స్టేషన్లు, 250 అవుట్‌పోస్టులు ఉన్నాయి. TASL సమర్పించిన నివేదిక, జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ 'తప్పిపోయిన' పోలీసు స్టేషన్‌లు, అవుట్‌పోస్టుల భౌతిక ధ్రువీకరణ ప్రక్రియను ప్రారంభించమని పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ఆదేశాలు జారీ చేసింది.
డీఐజీ, స్టేట్ క్రైమ్ రికార్డ్ (Crime Record) బ్యూరో, గత వారం సంబంధిత జిల్లాల ఎస్పీలందరికీ 'తప్పిపోయిన' పోలీస్ స్టేషన్‌లు, పోలీసు అవుట్‌పోస్టుల గురించి సవివరమైన సమాచారాన్ని త్వరగా అందించాలని కోరుతూ లేఖ రాశారు. లఖిసరాయ్‌లోని సింగ్‌చక్ మరియు బన్ను బాగీచా పోలీస్ స్టేషన్‌లు అసలు గుర్తించలేకపోయారు. చిరునామాల వద్ద. అదేవిధంగా, జమాల్‌పూర్ రైలు జిల్లా పరిధిలోని చనన్ రైల్వే పోలీస్ స్టేషన్ ఉనికిలో లేదు.
ఈ సమస్యపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. కొన్ని చోట్ల రైలు రాకపోకలు సాగకపోవడంతో పోలీస్టేషన్ నిర్వహణ కష్టం అయ్యిందని పేర్కొన్నారు. త్వరలో రవాణా పునరుద్ధర పూర్తయిన తర్వాత అలాంటి స్టేషన్‌లను పునరుద్ధరిస్తారని ఆయన తెలిపారు.
ఈ విషయం తెలిసిన ఏడీజీ (ADG) ర్యాంక్ అధికారి మాట్లాడుతూ, “కొన్నిసార్లు, పోలీస్ స్టేషన్‌లకు సొంత భవనాలు లేనందున కొన్ని ఇతర ప్రాంతాలకు మార్చబడతాయి. అంతేకాకుండా, ఏదైనా పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ అవుట్‌పోస్ట్ పూర్తిగా పని చేసేలా చేయడం చాలా సమయం తీసుకునే ప్రక్రియ అని ఆయన అన్నారు. దీనిపై త్వరగా ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Police, Police station