పోలీసులను చంపిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే తల్లి సంచలన వ్యాఖ్యలు..

రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తర్వాతే వికాస్ నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు మంత్రి సంతోశ్ శుక్లాను కూడా హతమార్చాడని అన్నారు.

news18-telugu
Updated: July 4, 2020, 11:34 AM IST
పోలీసులను చంపిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే తల్లి సంచలన వ్యాఖ్యలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యూపీలోని కాన్పూర్‌లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై వికాస్ దూబే తల్లి సరళాదేవి స్పందించారు. పోలీసులను చంపిన విషయాన్ని తాను టీవీలో చూసి తెలుసుకున్నానని ఆమె తెలిపారు. పోలీసులను చంపి తన కొడుకు చాలా చెడ్డపని చేశాడని, ఎనిమిది మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న తన కుమారుడిని పోలీసులే చంపేయాలని కోరారు. పోలీసులకు అతడు ఎక్కడ ఉంటున్నాడో తెలిసినా ఎందుకు పట్టుకోవట్లేదని ప్రశ్నించారు. తన కొడుకుని అరెస్ట్ చేసి తర్వాత ఎన్‌కౌంటర్ చేసేయాలని కోరారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తర్వాతే వికాస్ నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు మంత్రి సంతోశ్ శుక్లాను కూడా హతమార్చాడని అన్నారు.

నాలుగు నెలలుగా తన కుమారుడిని కలవలేదని చెప్పారు. ప్రస్తుతం ఆమె తన చిన్న కుమారుడితోనే లక్నోలో నివాసం ఉంటున్నానని తెలిపింది. ఇదిలావుంటే.. వికాస్ దుబే ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు ఇస్తామని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ ప్రకటించారు. కాన్పూర్ పరిధిలోని బికారు గ్రామంలో పోలీసు లైన్ వద్ద జరిగిన ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటరులో డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేంద్ర మిశ్రాతో సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఇంటిపై దాడి చేసేందుకు పోలీసు బృందం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
Published by: Narsimha Badhini
First published: July 4, 2020, 11:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading