Coronavirus: రూ.15 కోట్ల విలువైన మాస్కుల నిల్వ.. అధికారుల సీజ్

కరోనా వైరస్ వ్యాప్తని ఆరికట్టడంలో కీలకంగా పనిచేసే మాస్కులను కొంతమంది అక్రమార్కులు నిల్వ చేస్తున్నారు. ఆ నిల్వ చేసిన రూ.15 కోట్ల విలువైన మాస్కులను ఒకచోట, మరో ఘటనలో 200 బాక్సుల మాస్కులను పోలీసులు సీజ్ చేశారు.

news18-telugu
Updated: March 25, 2020, 6:08 PM IST
Coronavirus: రూ.15 కోట్ల విలువైన మాస్కుల నిల్వ.. అధికారుల సీజ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒకట్రెండు కాదు.. ఏకంగా రూ.15 కోట్ల విలువైన 25 లక్షల మాస్కులు రహస్యంగా నిల్వ చేసిన ఉదంతం ముంబై నగరంలో వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. అయితే కరోనా వైరస్ మహామ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో మాస్క్‌లది కీలక పాత్ర. దేశంలో లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల నిల్వలను అరికట్టేందుకు చేసిన దాడుల్లో ఈ మాస్కుల అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ముంబై సబర్బన్ షా వేర్ హౌసింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ గోడౌన్‌పై దాడి చేసి 200 బాక్సుల ఫేస్ మాస్కులను స్వాధీన పర్చుకున్నారు. అయితే మరో దాడిలో సోమవారం సాయంత్రం రూ.15 కోట్ల విలువైన 25 లక్షల మాస్కులను పోలీసులు సీజ్ చేశారు.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading