POLICE SEARCHING FOR TWO UNKNOWN PEOPLE WHO ASKED ABOUT RIL CHAIRMAN MUKESH AMBANI HOUSE ANTILIA HOUSE ADDRESS AK
Mukesh Ambani | ముఖేష్ అంబానీ ఇంటి అడ్రస్ కోసం ఆరా.. ఆ ఇద్దరి కోసం ముంబై పోలీసుల గాలింపు
ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం (ఫైల్ ఫోటో)
Mukesh Ambani: ఓ టాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో టాక్సీ డ్రైవర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన పోలీసులు.. అనంతరం ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ముఖేష్ అంబానీ నివాసరమైన అంటిలియా అడ్రస్ అడిగిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం ముంబై పోలీసులు గాలింపు చేపట్టారు. ఓ టాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో టాక్సీ డ్రైవర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన పోలీసులు.. అనంతరం ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఓ కారులోని ఇద్దరు వ్యక్తులు అంటిలియా అడ్రస్ కోసం అడిగారని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. ఓ కారులో వెళుతున్న ఆ ఇద్దరు ఆజాద్ మైదాన్ సమీపంలోని ఖిలా కోర్టు దగ్గర టాక్సీ డ్రైవర్‌ను అంటిలియా అడ్రస్ కోసం అడిగినట్టు సమాచారం. మరోవైపు వారి గురించి గాలిస్తున్న పోలీసులు.. సిల్వర్ కలర్ కారు కోసం అన్వేషిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నాకాబందీలు కూడా ఏర్పాటు చేశారు.
ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు నంబర్ గురించిన సమాచారాన్ని టాక్సీ డ్రైవర్ పోలీసులకు అందించారు. అయితే ఆ కారు నంబర్ సరైంది కాదని పోలీసులు భావిస్తున్నారు. యెల్లో ప్లేట్ ఉన్న సిల్వర్ కలర్ వ్యాగన్ ఆర్ కారు కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులోని ఇద్దరు వెనుక సీటులో కూర్చున్నట్టు పోలీసులకు తెలిసింది. వాళ్లిద్దరూ కుర్తా పైజామాలు ధరించారని.. ఇద్దరూ హిందీ, ఉర్దూలో మాట్లాడుకున్నట్టు ప్రాథమిక సమాచారం.
టాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ ఇద్దరి పన్నిన కుట్ర ఏమిటనే దానిపై పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. దీంతో వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఆ ఇద్దరు కనిపించినట్టు చెబుతున్న ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఖిలా కోర్టు సమీపంలో వారిద్దరినీ చూసినట్టు తెలిపిన టాక్సీ డ్రైవర్.. ఆ ఇద్దరు ఉన్న కారు ఎటు వైపు వెళ్లిందో మాత్రం తెలియదని తెలిపాడు. ముంబై పోలీస్ పరిధిలోని డీసీపీ జోన్ 1, డీసీపీ జోన్ 2 ఈ విచారణను పర్యవేక్షిస్తోంది.
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా సమాంతరంగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నగరంలోని కీలకమైన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర పోలీసులు హై అల్టర్ జారీ చేశరు. పలు ప్రాంతాల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆజాద్ మైదాన్ నుంచి అంటిలియాకు వెళ్లే ఐదు వేర్వేరు మార్గాల్లో పోలీసులు సెక్యూరిటీ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అయితే అంటిలియా భవనానికి పటిష్టమైన భద్రత ఉంటుందని తెలిపారు. టాక్సీ డ్రైవర్ చెప్పిన సమాచారం మేరకు ఆ కారు కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.