Home /News /national /

POLICE RECOVERS 234 KGS OF GOLD FROM A VAN IN TAMILNADU AHEAD OF ASSEMBLY ELECTIONS SK

అర్ధరాత్రి రోడ్డుపై పోలీసులు.. ఓ వ్యాన్‌ను చెక్‌చేస్తే ఏకంగా 234 కిలోల బంగారం.. ఎక్కడిది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బంగారం ఆభరణాలను చెన్నైలోని ఓ ప్రముఖ నగల దుకాణం నుంచి సేలంకు తరలిస్తున్నామని వారు చెప్పారు. సేలంలోని నగల వ్యాపారులకు అందజేయాల్సి ఉందని పేర్కొన్నారు. అంత మొత్తంలో బంగారం తరలిస్తున్నప్పుడు ధృవీకరణ పత్రాలు ఉండాలి కదా? అని అధికారులు ప్రశ్నిస్తే.. వారి నోట వెంట సమాధానం రాలేదు.

ఇంకా చదవండి ...
    తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. డబ్బుతో పాటు గృహోపకరణాలను పంచుతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కొందరు అభ్యర్థులైతే ఏకంగా బంగారం పంచుతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడడం సంచలనం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాత్రిళ్లు తనిఖీలు చేయడం సాధారణ విషయమే. ఈక్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి సేలం-చెన్నై హైవేపై పెరియారీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేశారు.


    చెన్నై నుంచి సేలం వైపు వెళ్తున్న వ్యాన్ అనుమానస్పదంగా కనిపించడంతో.. క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అందులో ఏకంగా 234 కిలోల బంగారం బయటపడడంతో పోలీసులు షాక్ తిన్నారు. అన్నీ బంగారం ఆభరణాలే ఉన్నాయి. వ్యాన్‌లో వెళ్తున్న వ్యక్తులను బంగారం గురించి అధికారులు ఆరాతీశారు. కానీ వారి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

    ఐతే బంగారం ఆభరణాలను చెన్నైలోని ఓ ప్రముఖ నగల దుకాణం నుంచి సేలంకు తరలిస్తున్నామని వారు చెప్పారు. సేలంలోని నగల వ్యాపారులకు అందజేయాల్సి ఉందని పేర్కొన్నారు. అంత మొత్తంలో బంగారం తరలిస్తున్నప్పుడు ధృవీకరణ పత్రాలు ఉండాలి కదా? అని అధికారులు ప్రశ్నిస్తే.. వారి నోట వెంట సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో ఆ బంగారంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకే తీసుకెళ్తున్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 2న కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఫలితాలను ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Gold, Tamil Nadu Assembly Elections 2021, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు