కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో మద్యం బాటిళ్లు... నలుగురు అరెస్ట్

పేదలకు నిత్యావసర సరుకులు పంచేందుకు కారును తీసుకెళ్లారని.. అందులోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయో తెలియదని అన్నారు. తనపై ఎవరో కావాలనే కుట్ర చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.

news18-telugu
Updated: May 14, 2020, 2:31 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో మద్యం బాటిళ్లు... నలుగురు అరెస్ట్
మద్యం తాగొద్దు. డిన్నర్‌కు ముందు మద్యం సేవించడం చాలా మందికి అలవాటు. అయితే, మంచి నిద్ర కావాలంటే మాత్రం మీరు రాత్రి పూట మద్యానికి దూరంగా ఉన్నారు.
  • Share this:
లాక్‌డౌన్-3లో సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. షాపులైన ఓపెన్ అయి రెండు మూడు రోజుల వరకు భారీ క్యూలు కనిపించినప్పటికీ.. ప్రస్తుతం సాధారణ పరిస్థితులే నెలకొన్నాయి. ఐతే కొన్ని రాష్ట్రాల్లో మద్యపానంపై నిషేధం ఉంది. ఐనప్పటికీ చాలా చోట్ల అక్రమ మద్యం పట్టుబడతూనే ఉంది. ఈ క్రమంలో బీహార్‌లోని బక్సర్ జిల్లా ఓ ఎమ్మెల్యే అధికారిక వాహనంలో 8 బాటిళ్ల మద్యం పట్టుబడింది. అది ఎమ్మెల్యే కారని తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మందిని అరెస్ట్ చేశారు.

గురువారం బక్సర్ జిల్లా సిమ్రీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అటు నుంచి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు వచ్చింది. ఐనా వదలిపెట్టలేదు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా 8 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఆ వాహనం బక్సర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ తివారికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న నలుగురు ఎమ్మెల్యే అనుచరులను అరెస్ట్ చేశారు. ఐతే తనిఖీలు జరిగినప్పుడు ఎమ్మెల్యే కారులో లేరని పోలీసులు తెలిపారు.

ఐతే దీనిపై ఎమ్మెల్యే సంజయ్ వాదన మరోలా ఉంది. పేదలకు నిత్యావసర సరుకులు పంచేందుకు కారును తీసుకెళ్లారని.. అందులోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయో తెలియదని అన్నారు. తనపై ఎవరో కావాలనే కుట్ర చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. సిమ్రి ప్రాంతానికి అసలు తన కారు ఎలా వెళ్లిందో అర్థం కావడం లేదని.. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
Published by: Shiva Kumar Addula
First published: May 14, 2020, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading