హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్... ఓ పోలీస్ మృతి... ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్... ఓ పోలీస్ మృతి... ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్... ఓ పోలీస్ మృతి... ముగ్గురు ఉగ్రవాదులు హతం (File)

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్... ఓ పోలీస్ మృతి... ముగ్గురు ఉగ్రవాదులు హతం (File)

అసలు సరిహద్దుల్లో ఉగ్రవాదులు ఎలా చొరబడగలుగుతున్నారు? బోర్డర్‌లో లోపాల్ని ప్రభుత్వాలు ఎందుకు సరిచెయ్యలేకపోతున్నాయి?

వారంలో ఒక్కసారైనా ఇలాంటి వార్తలు మనం వింటున్నాం. దశాబ్దాలుగా ఇదే తంతు. తాజాగా జమ్మూకాశ్మీర్... శ్రీనగర్‌లోని... పంతా చౌక్ దగ్గర పోలీసులు, CRPF జవాన్లు ఉన్న చెక్ పాయింట్ దగ్గర ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అలర్టైన సైన్యం కౌంటర్ కాల్పులు జరిపింది. రెండువైపులా బుల్లెట్ల మోత. అటు ఉగ్రవాదులు, ఇటు సైన్యం, పోలీసులు... ఎవరికి వారు తలో దిక్కుకూ వెళ్లి... తుప్పల చాటున, భవనాల మాటునా ఉంటూ... వీలు దొరికినప్పుుడల్లా కాల్పులు జరుపుతూ... ఆపరేషన్ చేశారు. ఇలా కొంత సేపు ఫైరింగ్ జరిగాక... ఉగ్రవాదుల వైపు నుంచి కాల్పులు రావడం ఆగిపోయింది. దాంతో ఆపరేషన్ ముగించిన సైన్యం... వెళ్లి చూడగా... ముగ్గరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. ఇటు పోలీసుల్లో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయారు.

శనివారం రాత్రి ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. రెండు జాయింట్ పార్టీలు... ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా... ఉగ్రవాదులు ఈ కాల్పులు జరిపినట్లు ఆర్మీ తెలిపింది. ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న పుల్వామాలో కూడా ముగ్గురు ఉగ్రవాదుల్ని లేపేసిన సైన్యం... మొన్న నలుగుర్ని హతమార్చింది.

అసలు సరిహద్దుల్లో ఉగ్రవాదులు ఎలా చొరబడగలుగుతున్నారు? బోర్డర్‌లో లోపాల్ని ప్రభుత్వాలు ఎందుకు సరిచెయ్యలేకపోతున్నాయి? అన్న డౌట్ మనకు రావచ్చు. కారణమేంటంటే... మన సరిహద్దులన్నీ కొండలు, అడవులతో ఉంటాయి. అక్కడ బోర్డర్లు, కంచెలు వెయ్యడం అన్ని చోట్లా సాధ్యం కాదు. అలాంటి చోట్ల సొరంగాలు తవ్వుతూ... ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడుతున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Jammu and Kashmir

ఉత్తమ కథలు