సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాహన సవరణ చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే.అప్పటి నుండి వాహనదారులు బండి బయటకు తీద్దాం అంటే ఎక్కడ చలానాల మోత మోగి పోతుందేమో అని భయపడుతున్నారు .లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసినా లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుంటే రూ 5 వేల వరకు, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ 10 వేల వరకు , బండి ఇన్సూరెన్స్ లేకుంటే 2 వేల వరకు ఫైన్ విధిస్తారు. మీ దగ్గర అన్ని డాకుమెంట్స్ ఉండి కూడా ఒక వేళ మీరు మర్చిపోయి ఉంటే మీ ట్రాఫిక్ చలాన్లు రూ 100 వరకు తగ్గించుకునే అవకాశం ఉంది అని సునీల్ అనే పోలీస్ ఒక ఫేస్బుక్ వీడియో ద్వారా తెలిపారు. ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించిన చోదకుడు డాక్యూమెంట్స్ రెడీ చేసుకొని 15 రోజుల్లోపు జరిమానా చెల్లించవచ్చు. ఈ విధంగా మీరు తక్కువ జరిమానాతో బయటపడచ్చు. కానీ దీనిలో ఇంకో నిబంధన ఉంది హెల్మెట్ లేకుండా మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రం ఈ నిబంధన వర్తించదు. 15 రోజులలో సరైన డాక్యూమెంట్స్ చూయించి మీరు చలానా చెలిస్తే మీరు రూ 100 చెల్లిస్తే సరిపోతుంది.కానీ 15 రోజులు దాటితే పూర్తి చలానా ఖచ్చితంగా చెల్లించాలి.సునీల్ ఈ విధంగా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad police, Policeman, TRAFFIC AWARENESS, Traffic challan, Traffic police, Traffic rules