• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • POLICE GIVES PARTY TO PRISONER WITH LIQUOR AND CHICKEN IN UTTAR PRADESH VIDEOS GOES VIRAL SK

ఖైదీకి ముక్క.. చుక్క.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన పోలీసులు.. కోర్టు నుంచి నేరుగా బార్‌కు..

ఖైదీకి ముక్క.. చుక్క.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన పోలీసులు.. కోర్టు నుంచి నేరుగా బార్‌కు..

ప్రతీకాత్మక చిత్రం

పోలీసులు, ఖైదీ కలిసి బార్ అండ్ రెస్టారెంట్‌లో ఎంచక్కా కూర్చున్నారు. అనంతరం ఖైదీకి మందుతో పాటు పసందైన చికెన్ వంకాలను వడ్డించారు. బార్‌లో మద్యం తాగుతూ చికెన్ తింటూ తెగ ఎంజాయ్ చేశాడా ఖైదీ.

  • Share this:
    ఒక ఖైదీ జైలు నుంచి కోర్టుకు వెళ్తున్నాడంటే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. చేతికి బేడీలు వేసి.. పోలీసులు పట్టుకొని.. కోర్టుకు తీసుకెళ్తారు. విచారణ పూర్తైన తర్వాత మళ్లీ అంతే సెక్యూరిటీతో జైలుకు తరలిస్తారు. కానీ యూపీలో కొందరు పోలీసులు ఖైదీకి పార్టీ ఇచ్చారు. లిక్కర్‌తో పాటు నోరూరించే చికెన్ వంటకాలతో ఘనంగా విందు ఏర్పాట్లు చేశారు. యూపీలోని బరేలీలో ఈ ఘటన జరిగింది. పోలీసులతో పాటు ఉన్న ఓ ఖైదీ మద్యం తాగుతూ, చికెన్ తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీకి చెందిన ఓ వ్యక్తి బరేలి జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. మార్చి 10 కోర్టులో విచారణ ఉండడంతో పోలీసుల అతడిని కోర్టుకు తీసుకెళ్లారు. విచారణ ముగిసిన తర్వాత నేరుగా జైలుకు తీసుకెళ్లకుండా బార్‌కు తీసుకెళ్లారు.

    పోలీసులు, ఖైదీ కలిసి బార్ అండ్ రెస్టారెంట్‌లో ఎంచక్కా కూర్చున్నారు. అనంతరం ఖైదీకి మందుతో పాటు పసందైన చికెన్ వంకాలను వడ్డించారు. బార్‌లో మద్యం తాగుతూ చికెన్ తింటూ తెగ ఎంజాయ్ చేశాడా ఖైదీ. అక్కడే బార్ అండ్ రెస్టారెంట్‌లో ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా ఖైదీకి పార్టీ మందు పార్టీ ఇస్తే ఇబ్బందులు వస్తాయి.. కదా అని కొందరు ప్రశ్నించారు. అవన్నీ మేం చేసుకుంటాం.. అని తేలిగ్గా తీసుకున్నారు పోలీసులు. ఐతే వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఖైదీని బార్‌కు తీసుకెళ్లిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేతప్ప ఎలాంటి సస్పెన్షన్ చేయలేదని సమాచారం.

    పోలీసుల తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు ఇంత నీచానికి దిగుజారుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి పార్టీ ఇస్తారా? ఆని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ పోలీస్ అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు