Home /News /national /

POLICE FINDS NEW WAY TO PUNISH LOCKDOWN VIOLATORS WRITE LORD SRI RAMS NAME IN MADHYA PRADESH GH SK

Lockdown: లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి ఊహించని శిక్ష.. శ్రీ రాముడి పేరు రాయాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, బయటకు వచ్చిన వారికి వినూత్న శిక్షలు విధిస్తున్నారు ఎస్‌ఐ సంతోష్ సింగ్. ఇలాంటి వారిని దాదాపు 30 నుంచ?

కరోనా నివారణకు చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అయితే ఆంక్షల పేరుతో కొందరు పోలీసులు సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారు. కొంతమందిని దారుణంగా కొట్టిన ఉదంతాలు కూడా తారసపడుతున్నాయి. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి మాత్రం వైవిధ్యంగా ఆలోచించించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, బయటకు వచ్చిన వారికి వినూత్న శిక్షలు విధిస్తున్నారు ఎస్‌ఐ సంతోష్ సింగ్. ఇలాంటి వారిని దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు కూర్చోబెట్టి శ్రీ రాముని పేరును (శ్రీ రామ్) రాయిస్తున్నారు. దీంతో పాటు ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు ఎస్‌ఐ సంతోష్ సింగ్. ఈ జిల్లాలో ప్రభుత్వం మొత్తం 20 చెక్ పాయింట్ల వద్ద కఠినంగా ఆంక్షలు అమలుచేస్తోంది. ఇందులో భాగంగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే, వారికి శిక్షగా బుక్ లెట్లు ఇచ్చి రాముడి పేరు రాయమని సూచిస్తున్నారు సంతోష్. "ఇంతకు ముందు ఎవరైనా లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తే 45 నిమిషాల పాటు వారిని కూర్చొబెట్టి పంపేవాళ్లం. అయితే దీనికి బదులుగా వారితో శ్రీ రాముడి పేరును రాయించడం మంచిదనే ఆలోచన వచ్చింది. ఖాళీగా కూర్చో పెట్టడానికి బదులుగా, వారికి బుక్ లెట్లు ఇచ్చి శ్రీ రాముని పేరు రాయిస్తున్నాం. ఇంట్లో కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోమని కౌన్సిలింగ్ ఇస్తున్నాం" అని సంతోష్ సింగ్ తెలిపాడు.

అయితే ఎవ్వరినీ బలవతంగా రాముడి పేరు రాయమని ఫోర్స్ చేయట్లేదు ఈ పోలీసు అధికారి. వారికి ఇష్టముంటేనే రాయమని సూచిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మూడు రోజుల నుంచి ఈ విధంగా చేస్తున్నామని, ఇప్పటి వరకు లాక్ డౌన్ ఉల్లఘించిన 25 మందిని ఇలా శిక్షించినట్లు స్పష్టం చేశారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. ఈ విషయంపై సత్నా పోలీసు సూపరింటెండెంట్ ధర్మ్ వీర్ సింగ్ స్పందించారు. "మాకు ఇలాంటి చెక్ పాయింట్లు 20 ఉన్నాయి. ప్రతి షిఫ్టులో ఇద్దరు అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓ అధికారి తన సామర్థ్యం మేరకు ఈ విధగా చేస్తున్నట్లు తెలిసింది. ఇది చట్టబద్ధం కాదు. ఇలా చేయడాన్ని ప్రశంసించరు. అతడు చట్టానికి, వృత్తికి కట్టుబడి ఉండాలి" అని స్పష్టం చేశారు.

Keywords

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Lockdown

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు