హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

4500 సీసాల మద్యం పారబోత.. మందుబాబుల గుండె పగిలింది..

4500 సీసాల మద్యం పారబోత.. మందుబాబుల గుండె పగిలింది..

40 రోజులుగా మద్యం లేక మేం చస్తుంటే.. మీరేమో అంత సరుకును పారబోస్తారా? అంటూ కొందరు సరదాగా అభిప్రాపడుతున్నారు. మా గుండెలు పగిలాయంటూ ఫన్నీ మీమ్స్ పెడుతున్నారు.

  కరోనా లాక్‌డౌన్‌లో మందు బాబుల కష్టాలేంటో అందరికీ తెలుసు. 40 రోజులుగా మందు గిలాగిలా కొట్టుకుంటున్నారు. బ్లాక్‌లో దొరుకుతున్నా అంత డబ్బు పెట్టలేక.. అల్లాడిపోతున్నారు. ఐతే ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో నేటి నుంచి వైన్ షాపులు తెరచుకోవడంతో తెల్లవారుజాము నుంచే మందబాబులు క్యూ కట్టారు. దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఈ క్రమంలో తమిళనాడులో పెద్ద మొత్తంలో మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఏకంగా 4500 సీసాల పలు బ్రాండ్లకు చెందిన మద్యాన్ని పారబోశారు. అన్ని బాటిళ్ల మద్యాన్ని డ్రమ్ములో పోసి అనంతరం ఓ ఖాళీ స్థలంలో పారబోశారు. మధురైలోని నాగామలై పొదుకొట్టైలో ఈ ఘటన జరిగింది.

  లాక్‌డౌన్ వల్ల అన్ని చోట్లా మద్యం షాపులు మూతపడ్డాయి. ఐతే కొందరు అక్రమార్కులు సీక్రెట్‌గా షాపులు ఒపెన్ చేసి మద్యాన్ని తరలించారు. బ్లాక్‌లో మూడింతలు ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులకు సమాచారం వెళ్లడంతో.. కోడిమంగళం, కీలామాథుర్,తువారిమన్ ప్రాంతాలు సహా పలు పోలీసులు సోదాలు చేశారు. వారి తనిఖీల్లో పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడింది. దాదాపు 4500 దేశీ మద్యంతో పాటు విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మద్యంతో పాటు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా.. పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేయాలని స్పెషల్ కోర్టు ఆదేశింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ లిక్కర్ మొత్తాన్ని పారబోశారు పోలీసులు.

  ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్‌లు పెడుతున్నారు నెటిజన్లు. 40 రోజులుగా మద్యం లేక మేం చస్తుంటే.. మీరేమో అంత సరుకును పారబోస్తారా? అంటూ కొందరు సరదాగా అభిప్రాపడుతున్నారు. మా గుండెలు పగిలాయంటూ ఫన్నీ మీమ్స్ పెడుతున్నారు.

  First published:

  Tags: Liquor sales, Liquor shops, Tamilnadu, Wine shops

  ఉత్తమ కథలు