Home /News /national /

Nagaland firing accident:  ‘నాగాలాండ్​ ఘటన’ జవాన్లపై హత్యాయత్నం కేసుల నమోదు.. విచారణ ప్రారంభించిన అధికారులు

Nagaland firing accident:  ‘నాగాలాండ్​ ఘటన’ జవాన్లపై హత్యాయత్నం కేసుల నమోదు.. విచారణ ప్రారంభించిన అధికారులు

కూలీల మృతదేహాలు (photo: tridipkmandal/Twitter)

కూలీల మృతదేహాలు (photo: tridipkmandal/Twitter)

సైనిక దళాల కాల్పుల్లో నాగాలాండ్‌లో 14 మంది కూలీలు మరణించిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.  21వ పారా స్పెషల్‌ ఫోర్స్‌ జవాన్లపై సోమవారం సుమోటోగా హత్య కేసు నమోదు చేశారు.

    ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ (Nagaland)లో బొగ్గు గని కూలీలపై భారత ఆర్మీ కాల్పులు జరిపిన ఘటన (Nagaland firing accident) దేశాన్ని కుదిపేసింది. పార్లమెంట్ లోనూ రచ్చకు దారితీసింది.  నాగాలాండ్‌లో ఆర్మీ బలగాలు శనివారం చేపట్టిన తీవ్రవాద నిరోధక ఆపరేషన్‌లో భారీ తప్పిదం జరిగింది. శనివారం రాత్రి నాగాలాండ్‌లోని మోన్ జిల్లా పరిధిలోని ఓటింగ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్‌ జరిపిన కాల్పుల్లో (Nagaland firing accident) 14 మంది పౌరులు, ఒక సైనికుడు మరణించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెష‌ల్ ప‌వ‌ర్స్ యాక్ట్‌ (Armed Forces Special Powers Act) అమలులో ఉన్నందున సైన్యం  కాల్పులకు పాల్పడిందని విపక్షాలు ఆరోపించాయి. ఈ ఘటనలో ప్రభుత్వ వివరణ కోరుతూ ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం ఏర్పడింది. చివరికి నాగాలాండ్ కాల్పులపై (Nagaland firing accident) కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వివరణ ఇచ్చారు. తప్పుడు నిర్ధారణ వల్లే కాల్పులు జరిగాయన్న హోం మంత్రి.. నాగాలాండ్ కాల్పుల ఘటనపై సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సైనిక దళాల కాల్పుల్లో నాగాలాండ్‌లో 14 మంది కూలీలు మరణించిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.  21వ పారా స్పెషల్‌ ఫోర్స్‌ జవాన్లపై సోమవారం సుమోటోగా హత్య కేసు నమోదు చేశారు.

    ఈ మేరకు మోన్‌ జిల్లాలోని తిజిత్‌ పోలీసు స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 302, 307, 34 కింద కేసు పెట్టారు. హత్యా (murder), హత్యాయత్నం, నేరపూరిత చర్య (Criminal action) అభియోగాల కింద ఈ కేసు (cases) నమోదయ్యింది. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో మోన్‌ పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు.  జవాన్ల కాల్పుల్లో 14 మంది అమాయక కూలీల మృతికి నిరసనగా పలు గిరిజన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సోమవారం నాగాలాండ్‌ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా భద్రతా దళాలు, విద్యార్థుల మధ్య స్వల్పంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐదు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని నాగా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌) ప్రకటించింది.

    చట్టాన్ని రద్దు చేయడమే నివాళి..

    వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయడమే కూలీల త్యాగానికి అసలైన నివాళి అవుతుందని ఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు ఉద్ఘాటించారు. శనివారం, ఆదివారం జరిగిన కాల్పుల ఘటనల్లో మొత్తం 28 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు.

    ఆరు వారాల్లోగా నివేదిక అందజేయాలని..

    జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) సోమవారం కేంద్రం, నాగాలాండ్‌ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సైనికుల కాల్పులు, అమాయక కూలీల మృతిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సంఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆరు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ రక్షణ శాఖ కార్యదర్శి, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, నాగాలాండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Nagaland

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు