PNB Scam Nirav Modi: నీరవ్ మోదీకి మరోసారి ఎదురుదెబ్బ... బెయిల్ పిటీషన్ తిరస్కరణ...

PNB Scam Nirav Modi | నీరవ్ బెయిల్ పిటిషన్ ను యూకే న్యాయస్థానం మరోసారి తిరస్కరించింది. కాగా నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ తిరస్కరణకు గురికావడం ఇది వరుసగా నాలుగో సారి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే పీఎన్‌బీ‌ బ్యాంకును మోసగించి 13 వేల కోట్ల నిధులు అక్రమంగా దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ, స్వదేశం విడిచి లండన్‌ లో తలదాచుకుంటున్నాడు.

news18-telugu
Updated: June 12, 2019, 5:29 PM IST
PNB Scam Nirav Modi: నీరవ్ మోదీకి మరోసారి ఎదురుదెబ్బ... బెయిల్ పిటీషన్ తిరస్కరణ...
నీరవ్ మోదీ (Image : Twitter)
news18-telugu
Updated: June 12, 2019, 5:29 PM IST
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీకి యూకే హై కోర్టులో చుక్కెదురైంది. నీరవ్ బెయిల్ పిటిషన్ ను యూకే న్యాయస్థానం మరోసారి తిరస్కరించింది. కాగా నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ తిరస్కరణకు గురికావడం ఇది వరుసగా నాలుగో సారి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే పీఎన్‌బీ‌ బ్యాంకును మోసగించి 13 వేల కోట్ల నిధులు అక్రమంగా దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ, స్వదేశం విడిచి లండన్‌ లో తలదాచుకుంటున్నాడు. అయితే భారత అధికారులు యూకే హోం మంత్రిత్వ శాఖను సంప్రదించగా, ఆయనను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా నీరవ్ మోదీని భారత్ కు అప్పగించాల్సిందిగా, ఇప్పటికే అధికారులు ప్రయత్నిస్తుండగా, ఆయన మాత్రం జైలు నుంచి బయటపడాలని వరుసగా న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి నీరవ్ మోదీ బెయిల్ పిటీషన్ తిరస్కరణకు గురైంది.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...