ఆ సందేహాలన్నీ అర్థంలేనివి... ప్రధాని వ్యాఖ్యలపై పీఎంవో వివరణ

ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను అనవసరమైనవిగా పీఎంవో పేర్కొంది.

news18-telugu
Updated: June 20, 2020, 4:03 PM IST
ఆ సందేహాలన్నీ అర్థంలేనివి... ప్రధాని వ్యాఖ్యలపై పీఎంవో వివరణ
ప్రధాని మోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
అఖిలపక్ష సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై వస్తున్న అభ్యంతరాలు, సందేహాలన్నీ అర్థంలేనివని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ప్రధాని వ్యాఖ్యలు గాల్వన్‌లో చనిపోయిన 20 మంది సైనికుల ప్రాణత్యాగాన్ని ఉద్దేశించినవని అని తెలిపింది. మన దేశంలోకి చైనా ఆక్రమణను 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు భగ్నం చేశారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలు మన దేశంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నించిన వారిని ఎదుర్కొన్న సైనికుల ధైర్యసాహసాలను తెలియజేయడానికే అని వివరించింది.భారత బలగాలు మన సరిహద్దుల్లో పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని, దేశ రక్షణకు అంకితమయ్యాయని ప్రధాని మోదీ చెప్పినట్టు పీఎంవో తెలిపింది. ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను అనవసరమైనవిగా పీఎంవో పేర్కొంది. అంతకుముందు కాంగ్రెస్ సహా పలువురు రక్షణ రంగ నిపుణులు నిపుణులు అఖిలపక్ష సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది.
First published: June 20, 2020, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading