• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • PMGKAY CENTRAL CABINET MAY ALSO APPROVE EXTENSION OF PM GARIB KALYAN YOJANA TILL NOVEMBER SAYS SOURCES NK

PM Scheme: కీలక పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం?.. కోట్ల మంది పేదలకు ప్రయోజనం

కీలక పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం? (image credit - twitter)

PM Scheme: ఈ కరోనా సమయంలో తమను ఆదుకునేందుకు సరైన పథకం కావాలని పేద ప్రజలు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే కేంద్ర క్యాబినెట్ ఆ పథకానికి మరోసారి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.

  • Share this:
    PM Garib Kalyan Yojana: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ అన్న యోజన పథకాన్ని (PMGKAY) నవంబర్ వరకూ కొనసాగించాలనే నిర్ణయానికి నేడు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యే ఈ పథకాన్ని దీపావళి వరకూ కొనసాగించాలని కేంద్రం ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి. ఈ కరోనా సమయంలో పేదల్ని ఆదుకునేందుకు కేంద్రం తెచ్చిన పథమే ఇది. "ఈ కరోనా సమయంలో... కేంద్ర ప్రభుత్వం పేదల పక్షాన అండగా నిలుస్తుంది. వారి ప్రతి అవసరాన్నీ వారి భాగస్వామిలా ఉంటూ తీర్చుతుంది" అని పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ప్రకటించాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం ద్వారా పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందిస్తోంది.

    ఈ స్కీమ్ ప్రకారం... 80 కోట్ల మంది భారతీయులు... ప్రతి నెలా కచ్చితమైన పరిమాణంలో... ఆహార ధాన్యాలను నవంబర్ వరకూ పొందుతారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

    2020లో ఇండియాకి కరోనా వచ్చినప్పుడు మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. పేదలకు ఆహార భద్రత కల్పిస్తామని చెప్పింది. ఈ స్కీమ్ ద్వారా... ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి దేశంలోని పేదవారికి నెలవారీ ఆహార ధాన్యాలు అందుతాయి. అత్యోదయ అన్న యోజన పథకం కింద లబ్దిదారులు అయిన వారంతా... ఈ పథకం ప్రయోజనాలు పొందగలరు.

    ప్రభుత్వ డొమైన్‌లో ఉన్న డేటా ప్రకారం... మే నెలలో PMGKAY కింద 55 కోట్ల మంది లబ్దిదారులు ఉచిత ఆహార ధాన్యాలను పొందారు. 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మే నెలలో కేంద్రం 28 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేసింది. ఈ పథకానికి సంబంధించి మే, జూన్ నెలకి కేంద్రం రూ.9,200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.

    ఇది కూడా చదవండి: Viral video: చేప పొట్టలో సీల్ విప్పని విస్కీ బాటిల్!... పండగ చేసుకున్న మత్స్యకారులు

    నవంబర్ తర్వాత పొడిగిస్తారా?:
    కేంద్రం నవంబర్ దాకా పొడిగించడానికి అసలు కారణం థర్డ్ వేవ్. కొంత మంది నిపుణుల ప్రకారం నవంబర్‌లో థర్డ్ వేవ్ వస్తుంది. కాబట్టి... అప్పటివరకూ పథకాన్ని పొడిగిస్తూ... కేంద్రం... నిజంగానే థర్డ్ వేవ్ నవంబర్‌లో వస్తే... మళ్లీ పథకాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే థర్డ్ వేవ్ రాకపోతే... నవంబర్‌తో పథకాన్ని ముగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: