Partition Horrors Remembrance Day: రేపు స్వాతంత్ర్య దినోత్సవం జరగనుండగా... ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 14ను విభజన భయానక జ్ఞాపకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. భారత్‌కి స్వాతంత్ర్యం ఇచ్చే ముందు బ్రిటీష్ పాలకులు... ఇండియాని రెండుగా విభజించి... పాకిస్థాన్‌ని స్వతంత్ర దేశంగా మార్చారు. అప్పట్లో ఈ నిర్ణయం చాలా మందికి నచ్చలేదు. ఈ విభజన వల్ల ఇండియాలో చాలా మంది పాకిస్థాన్‌కీ, పాకిస్థాన్‌లో చాలా మంది ఇండియాకీ వలస వచ్చారు. ఇదంతా అప్పట్లో పెద్ద చారిత్రాత్మక అంశం అయ్యింది. అప్పటి ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం ఆగస్ట్ 14న పాకిస్థాన్... స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. "విభజన బాధల్ని ఎప్పటికీ మర్చిపోలేం. లక్షల మంది మన సోదర సోదరీమణులు... తరలిపోవాల్సి వచ్చింది. చాలా మంది అప్పట్లో జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి మన ప్రజల బాధలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ... ఆగస్ట్ 14ను మనం విభజన భయానక జ్ఞాపకాల దినంగా జరుపుకుందాం" అని మోదీ ట్వీట్ చేశారు.
देश के बंटवारे के दर्द को कभी भुलाया नहीं जा सकता। नफरत और हिंसा की वजह से हमारे लाखों बहनों और भाइयों को विस्थापित होना पड़ा और अपनी जान तक गंवानी पड़ी। उन लोगों के संघर्ष और बलिदान की याद में 14 अगस्त को 'विभाजन विभीषिका स्मृति दिवस' के तौर पर मनाने का निर्णय लिया गया है।
రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.