హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Narendra Modi: ప్రధాని మోదీ ప్రసంగంలో కీలక అంశాలు ఇవే.. సాగు చట్టాల రద్దుతో పాటు ఇంకా ఏమన్నారంటే..

Narendra Modi: ప్రధాని మోదీ ప్రసంగంలో కీలక అంశాలు ఇవే.. సాగు చట్టాల రద్దుతో పాటు ఇంకా ఏమన్నారంటే..

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

Farm Laws: వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో కీలక అంశాలు ఏంటంటే..

వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రాల ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు వ్యవసాయ చట్టాల (Farm Laws)ను తమ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ఉదయం ప్రకటించారు. రైతుల నుంచి వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చెందిన రైతులు దాదాపు ఏడాది నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మూడు చట్టాలను ఉపసంహరించుకోవాలని వివిధ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Farm Laws: సాగు చట్టాల రద్దుపై నేతల స్పందన.. ఎవరు ఏమన్నారంటే..

రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం-2020, రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద చట్టం-2020, నిత్యావసర సరకుల(సవరణ) చట్టం 2020.. ఈ మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటిని ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రతరమయ్యాయి.

Farm Laws: సాగుచట్టాలను రద్దు చేసిన కేంద్రం.. అసలా చట్టాల్లో ఏముంది? రైతుల ఎందుకు వ్యతిరేకించారు?

ఈ ఏడాది జనవరిలో ఈ మూడు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఢిల్లీ సరిహద్దులోని సింగు, టిక్రీ, ఘాజీపూర్ ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకున్న రైతు సంఘాలు, అక్కడి నుంచి కదల్లేదు. వీటిని పూర్తిగా ఉపసంహరించుకునేంత వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని నేతలు చెప్పారు. ఈ క్రమంలో చట్టాల విషయంలో రైతు సంఘాలతో కేంద్రం 11 రౌండ్ల చర్చలు జరిపింది. కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని కేంద్రం చెప్పగా.. రైతు సంఘాలు మాత్రం ఈ చట్టాలు కార్పొరేట్లకు మేలు చేసేవిగా ఉన్నాయని విమర్శించాయి. రైతుల ఉధ్యమంలో భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నాయకుడు రాకేష్ టికాయత్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 26 నాటికి నిరసనలు ప్రారంభమై ఏడాది అయ్యేది.  చట్టాలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని టికాయత్ హెచ్చరించారు.

Narendra Modi: ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు

ఈ క్రమంలోనే వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో కీలక అంశాలు ఏంటంటే..

* కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా మేము చేయాలనుకున్న పనులు కొంతమంది రైతులకు అర్థం కాలేదు. ఈ విషయంలో రైతులను క్షమాపణలు కోరుతున్నాను. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ మూడు బిల్లులను ఉపసంహరించుకుంటాం.

- ఈరోజు గురునానక్ జయంతి సందర్భంగా రైతులందరూ తమ ఇళ్లకు, పొలాలకు తిరిగి వెళ్లాలని నేను అభ్యర్థిస్తున్నాను. మంచి పని చేయడంలో నేను ఎప్పటికీ ఆగను. ఏది చేసినా దేశం కోసమే చేస్తాను. నన్ను నమ్మండి.. మీ కలలు నెరవేర్చేందుకు మరింత కృషి చేస్తాను.

- నేను రైతుల ఇబ్బందులను చాలా దగ్గరగా చూశాను. అందుకే కృషి వికాస్ యోజనకు అంత ప్రాధాన్యత ఇచ్చాం. భారతదేశంలో దాదాపు 80% మంది రైతులకు రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. ఈ భూమే వారికి జీవనాధారం. వీరందరికీ మేలు చేస్తాం.

- రైతులకు సహాయం చేయడానికి, ఆదుకోవడానికి మా వంతు కృషి చేస్తున్నాం. చిన్న రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాం. తద్వారా వారు తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందుతారని భావించాం. దేశంలోని ప్రతి రైతు, రైతు సంస్థలు వ్యవసాయ చట్టాలను స్వాగతించాయి. వారందరికీ ధన్యవాదాలు.

- చట్టాల విషయంలో మా ఉద్దేశం స్వచ్ఛమైనది. అయితే కొంతమంది రైతులను ఒప్పించలేకపోయాం. ఈ చట్టాలను రైతులకు వివరించేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. మేము రైతు సంఘాలతో మాట్లాడాం, చర్చించాం. ఈ క్రమంలో చట్టాల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ రెండేళ్లలో చాలా జరిగింది...

- ప్రస్తుతం పంటల సరళిని మార్చే పనిలో ఉన్నాం. రైతులకు మేలు చేసేందుకు కేంద్రం, వ్యవసాయ నిపుణులు, రైతులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Agriculture, Farm Laws, Farmers, PM Narendra Modi

ఉత్తమ కథలు