అద్వానీ జీ..మీరే దిక్కు..!

ఓ కథనం ప్రకారం ఇటీవల అద్వానీని మోడీ కలిశారు. ఢిల్లీలోని పృథ్వీరాజ్‌లో ఉన్న అద్వానీ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. వయసు నిబంధనలను పక్కనబెట్టి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా అద్వానీనీ మోడీ కోరినట్లు సమాచారం.

Shiva Kumar Addula | news18india
Updated: June 5, 2018, 12:51 PM IST
అద్వానీ జీ..మీరే దిక్కు..!
అద్వానీతో ప్రధాని నరేంద్ర మోడీ (ఫైల్ ఫొటో)
  • Share this:
బీజేపీలో వృద్ధ నేతలను పక్కనబెట్టారు ప్రధాని మోడీ. ఎన్నికల ప్రచారంలోనూ, పార్టీ మీటింగుల్లోనూ వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మురళీ మనోహర్ జోషి, ఎల్‌కే అద్వానీలను సైతం పట్టించుకోవడం లేద. ఐతే విపక్షాలన్నీ ఏమవు తుండడం, ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం నేపథ్యంలో మోదీ వైఖరిలో మార్పు కనబడుతోది. 70 ఏళ్ల పైబడిన నేతలను పక్కన పెట్టకుండా పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో  పాటు..ఎన్నికల వేళ క్రీయాశీలంగా పాల్గొనేలా చేయాలని మోదీ భావిస్తున్నారు.

బెంగాలీ డైలీ ఆనంద్ బజార్ ప్రతిక కథనం ప్రకారం ..ఇటీవల అద్వానీని మోడీ కలిశారు. ఢిల్లీలోని పృథ్వీరాజ్‌లో ఉన్న అద్వానీ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఎన్డీయేకు మిత్రపక్షాలు దూరమవడం, విపక్షాలన్నీ మోడీ టార్గెట్‌గా పనిచేయడం, ఉప ఎన్నికల ఫలితాలు వంటి పలు అంశాలపై చర్చలు జరిపారు. 2019 ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలన్నదానిపై సమాలోచనలు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం హాజరయ్యారు.

వయసు నిబంధనలను పక్కనబెట్టి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా అద్వానీనీ మోడీ కోరినట్లు సమాచారం. వెటరన్ లీడర్ల సేవలను పార్టీ ఉపయోగించుకోవాలని లేకుంటే అంచనాలు తారుమారయ్యే అవకాశముందని వారితో అన్నట్లు తెలిసింది. గత కర్ణాటక ఎన్నికల్లోనే బీజేపీ వయసు నిబంధనను పక్కనబెట్టింది. 75 ఏళ్ల బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని భావిస్తోంది.

ఇప్పటికే బీజేపీకి టీడీపీ దూరమైంది. అటు శివసేన కూడా అదే బాటలో వెళ్తోంది. ఇక బీహార్‌లో జేడీయూ కూడా  కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పుతోంది. ఎన్నికల కు ముందు అన్నీ ప్రతికూల పరిస్థితులే నెలకొనడంతో.. బీజేపీ డైలమాలో పడింది. పార్టీలో సీనియర్ల విలువ తెలిసొచ్చింది. ఈ క్రమంలోనే ఎంఎం జోషి, అద్వానీ వంటి నేతలకు కీలక బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: June 5, 2018, 12:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading