ఆంధ్రప్రదేశ్, బీహార్‌లో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ... అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి పార్సీఘాట్కి వెళ్లిన ఆయన... బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించారు. 2014లో ఆ ప్రాంతం బీడు బీడు భూములతో ఉందనీ... ఇప్పుడు అక్కడ అందమైన స్డేడియం నిర్మింతమైందని చెప్పారు. పార్సీఘాట్ను ప్రజల సహకారంతో స్మార్ట్ సిటీగా మార్చుతామన్నారు. తాను చెప్పిన అన్ని పనులనూ ఐదేళ్లలో పూర్తి చేసేశానని అనట్లేదన్న ఆయన... తనకు ఎదురైన ప్రతి సవాలునూ సవాలుగానే స్వీకరించాన్నారు. అరుణాచల్ (పార్సీఘాట్)ను తూర్పు ఆసియాకి ఈశాన్య గేట్వేగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చామన్న ఆయన... ప్రతీ ఇంట్లో టాయిలెట్లు నిర్మించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
2004 నుంచీ 2009 మధ్య దేశంలోని ప్రతీ ఇంటికీ కరెంటు సరఫరా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా... 2014 నాటికి కూడా 18 వేల ఇళ్లు కరెంటు లేకుండా ఉన్నాయన్నారు నరేంద్ర మోదీ. బీజేపీ అధికారంలోకి వచ్చిన 1000 రోజుల్లో తాము దేశవ్యాప్తంగా అందరికీ కరెంటు ఇచ్చామన్నారు.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 3, 2019
భారత్‌ను ముక్కలు చేయాలనుకునేవారు జై హింద్ అనేందుకు ఇష్టపడరన్న మోదీ... అలాంటి వారు కాంగ్రెస్‌కి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. దేశద్రోహులను శిక్ష వెయ్యాలని మీరు కోరుకోవట్లేదనా అని ప్రజలను ప్రశ్నించారు. అలాంటి వారిని శిక్షించేందుకు బలమైన న్యాయవ్యవస్థ ఉండాలని కోరుకోవట్లేదా అని అడిగారు. కాంగ్రెస్ జాతీయవాదులతో చేతులు కలుపుతోందా, జాతి వ్యతిరేకులతో చేతులుకలుపుతోందా అని ప్రశ్నించిన మోదీ... ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నాలూ చెయ్యలేదన్నారు.
మధ్యాహ్నం ప్రధాని మోదీ... కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.