ఈ 6 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

వరదలను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ.

news18-telugu
Updated: August 10, 2020, 5:45 PM IST
ఈ 6 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఆరు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న అసోం, బీహార్, యూపీ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ ముఖ్యమంత్రులతో మాట్లాడి అక్కడి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరదలను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ.

ఈ సమావేశంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాగా, భారీ వర్షాల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. జలాశయాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: August 10, 2020, 5:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading