పాకిస్తాన్‌ మీదుగా ప్రధాని మోదీ ప్రయాణం

news18-telugu
Updated: August 22, 2019, 8:53 PM IST
పాకిస్తాన్‌ మీదుగా ప్రధాని మోదీ ప్రయాణం
నరేంద్ర మోదీ
news18-telugu
Updated: August 22, 2019, 8:53 PM IST
బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత తొలిసారి పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రధాని మోదీ ప్రయాణించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఫ్రాన్స్‌కు వెళ్లిన మోదీ...పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లారు. ఇవాళ ప్యారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మార్కోన్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. అనంతరం ఆగస్టు 23న యూఏఈ వెళ్లనున్న మోదీ అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమవుతారు. ఆగస్టుల 24న బహ్రెయిన్‌కు వెళ్లి ఆ దేశ ప్రధాని షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఆగస్టు 25న జీ-7 సదస్సులో పాల్గొనేందుకు తిరిగి ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు ప్రధాని మోదీ.


కాగా, ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది. మేలో పాకిస్తాన్ గగతలాన్ని తెరిచిప్పటికీ ప్రధాని మోదీ ఆ మార్గంలో వెళ్లలేదు. మేలో కిర్గిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన మోదీ ఒమన్, ఇరాన్ మీదుగా అక్కడి వెళ్లారు. బిష్కేక్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో పాల్గొని తిరిగి అదే రూట్‌లో భారత్‌కు చేరుకున్నారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఫ్రాన్స్ పర్యటన కోసం పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రయాణించారు ప్రధాని.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...