కేదార్‌నాథ్ (Kedarnath)లో 12 అడుగుల ఆదిశంకరాచార్య (Adi shankaracharya) విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తాజాగా ఆవిష్కరించారు. కృష్ణ శిలతో చెక్కిన ఈ విగ్రహాం ఆకట్టుకునేలా ఉంది. దీంతో ఈ విగ్రహాన్ని చెక్కిన శిల్పిపై అందరి దృష్టి పడింది. కర్ణాటకలోని హెచ్‌డీ కోటే నుంచి తెచ్చిన కృష్ణ శిలతో మైసూరుకు చెందిన 37 ఏళ్ల శిల్పి అరుణ్ యోగి రాజ్ (Arun Ygiraj) ఈ విగ్రహాన్ని చెక్కారు. 2020 జూన్ నుంచి ఈ శిల్పాన్ని చెక్కడం ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. దీన్ని పూర్తి చేయడానికి 9 నెలల సమయం పట్టిందన్నారు. ఈ ఆదిశంకరాచార్యుల విగ్రహం 28 టన్నుల బరువుంటుందని అరుణ్ తెలిపారు.
‘మైసూరులోని శంకర్ మఠం (Shankar Mutt)లోని కొద్ది మంది అధికారులు శ్రీ శంకరాచార్యుల గొప్ప వ్యక్తిత్వాన్ని నాకు వివరించారు. మానసికంగా కళతో మమేకం కావడానికి ఈ జ్ఙానం నాకు చాలా ఉపయోగపడింది. నేను చేసిన పనులు ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని శిల్పి అరుణ్ యోగిరాజ్ వివరించారు.
Petrol Price: పెట్రోల్ రేటు రూ.60కి తగ్గే ఛాన్స్.. కేంద్రం మదిలో కొత్త ప్లాన్.. అసలేంటది?
ఆదిశంకరాచార్య విగ్రహానికి తుదిరూపు ఇచ్చేందుకు యాసిడ్, నీటితో పాటు మంటను కూడా ఉపయోగించినట్టు అరుణ్ తెలిపారు. ఈ విగ్రహం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందన్నారు. హొయసల రాజుల కాలంలో దేవాలయాలకు ఉపయోగించిన కృష్ణ శిలనే ఆదిశంకరాచార్య విగ్రహానికి ఉపయోగించారు. శిల్పి అరుణ్ యోగి రాజ్ ఎంబీఏ పూర్తి చేసి కొన్నాళ్లు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేశారు. 2008లో ఉద్యోగం వదిలేసిన తరువాత పూర్తిగా శిల్ప కళకే అంకితం అయ్యారు.
PM Narendra Modi: కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు..
ఆదిశంకరాచార్య విగ్రహం చెక్కెందుకు అరుణ్ అనేక ప్రాజెక్టులను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆయన తండ్రి యోగిరాజ్ కేదార్‌నాథ్‌లో ఆదిశంకరాచార్య విగ్రహ పనులు పర్యవేక్షిస్తున్న సమయంలో సెప్టెంబరులో రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో అరుణ్ స్వయంగా పనులను పర్యవేక్షించారు. రాతి శిల్పాలు చెక్కడంలో విశ్వవిద్యాలయంగా వెలుగొందుతున్న తన తండ్రిని కోల్పోయిన అరుణ్.. విగ్రహ ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా సమన్వయం చేసుకున్నారు.
Diwali special : టపాసులు కాల్చడం కాదు.. అక్కడ కొట్టుకోవడమే దీపావళీ
అంతరించిపోతున్న శిల్పకళకు అరుణ్ తండ్రి యోగిరాజ్ ప్రాణం పోశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన వద్ద వందలాది మంది శిల్ప కళను నేర్చుకుని దేశ, విదేశాల్లోనూ విగ్రహాలు చెక్కుతున్నారు. దేశంలో అతి సున్నితమైన శిల్పాలు చెక్కడంలో యోగిరాజ్ నిష్ణాతులు. ఆదిశంకరాచార్య విగ్రహం చెక్కుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం ఎందరినో కలచివేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kedarnath, Narendra modi, PM Narendra Modi, Uttarakhand