PM Narendra Modi | దేశంలో టీనేజ్లకు వ్యాక్సినేషన్ (Vaccination) ప్రాసెస్ చాలా వేగంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 50శాతం మంది టీనేజర్లకు మొదటి డోస్ తాసుకొన్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
దేశంలో టీనేజ్లకు వ్యాక్సినేషన్ (Vaccination) ప్రాసెస్ చాలా వేగంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 50శాతం మంది టీనేజర్లకు మొదటి డోస్ తాసుకొన్నట్టు ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ట్వీట్ చేశారు. “యువత భారతదేశానికి మార్గం చూపుతోంది.. ఇది ప్రోత్సాహకరమైన వార్త. మనం వేగాన్ని కొనసాగిద్దాం. ” అంటూ ఆయన ట్వీట్ చేశారు. మంగళవారం, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, “కోవిడ్ -19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి గొప్ప రోజు! 15-18 ఏళ్ల మధ్య ఉన్న మా యువకుల్లో 50% పైగా కోవిడ్-19 (Covid 19) వ్యాక్సిన్ని మొదటి డోస్ పొందారు… టీకా పట్ల మీ ఉత్సాహం భారతదేశం అంతటా ప్రజలను ఉత్తేజపరుస్తుంది. అంటూ పేర్కొన్నారు.
విమాన సర్వీసులపై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం..
ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) తెలిపింది. అయితే ఎయిర్ బబూల్ ఆరేంజ్మెంట్స్ విమానాలకు ఈ కొత్త రెగ్యులేషన్స్ వర్తించవు. డీజీసీఏ అప్రూవ్ చేసిన విమానాలకు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లకు ఈ ఆంక్షలు వర్తించబోవని సివిల్ ఏవిషేయన్ జనరల్ డైరెక్టర్ నీరజ్ కుమార్ ఒక సర్క్యులర్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 9న అంతర్జాతీయ విమాన సర్వీసులపై డిసెంబర్ 31వ తేదీ వరకు డీజీసీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
భారీగా కేసులు..
బుధవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో భారతదేశంలో 2,82,970 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 441 సంబంధిత మరణాలు నమోదయ్యాయి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నవీకరించిన డేటా చూపించింది. యాక్టివ్ కాసేలోడ్ నిన్నటి 17.3 లక్షల నుండి 18,31,000కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 15.13 శాతానికి పెరిగింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.