స్వామి వివేకానందకు ప్రధాని మోదీ నివాళులు

రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ... పశ్చిమ బెంగాల్‌లో ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

news18-telugu
Updated: January 12, 2020, 9:22 AM IST
స్వామి వివేకానందకు ప్రధాని మోదీ నివాళులు
స్వామి వివేకానందకు ప్రధాని మోదీ నివాళులు (credit - twitter - PMO india)
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ, మిగతా ఎంపీలకూ ఓ స్పష్టమైన తేడా ఉంటోంది. మిగతావారు ప్రతిపక్షాలు చేసే ప్రతీ విమర్శకూ కౌంటర్లు ఇస్తుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం... వెంటనే స్పందించెయ్యకుండా... జస్ట్ అలా చూస్తూ ఉంటారు. చివరకు తాను చెప్పదలచుకున్నది చెబుతారు. చెయ్యాలనుకున్నది చేస్తారు. ప్రస్తుతం దేశంలో పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు, నిరసనలూ కొనసాగుతున్నా... ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీయే స్వయంగా తమ రాష్ట్రంలో పౌరసత్వ చట్టాన్ని అమలు చెయ్యబోమని చెప్పినా... ప్రధాని నరేంద్ర మోదీ అవేవీ పట్టించుకోకుండా... అదే రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటన కొనసాగిస్తున్నారు. ఉదయమే... బెలూర్‌లోని మఠాన్ని సందర్శించిన మోదీ... స్వామి వివేకానంద జయంతి సందర్భంగా... ఆయనకు నివాళులు అర్పించారు. అందుకు సంబంధించిన ఫొటోలను PMO ట్విట్టర్ ద్వారా పంచుకుంది. 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ... కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150 వార్షికోత్సవాల్లో పాల్గొని... నేతాజీ ఇండోర్ స్టేడియంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.తొలి రోజు పర్యటనలో ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. పౌరసత్వ చట్టం, NRC విషయంలో పునరాలోచించుకోమని ప్రధానిని కోరారు. ఐతే... ఆమె భేటీలో పాల్గొనడంతో... CAA వ్యతిరేకవాదులు... దీదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో... మోదీతో భేటీ అయిపోయిన వెంటనే మమత... CAA వ్యతిరేక ర్యాలీలో పాల్గొని... తాను ప్రధాని పక్షం కాదు అని పరోక్షంగా చెప్పుకున్నారు.
First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు