హోమ్ /వార్తలు /జాతీయం /

నేడు మాల్దీవులకు ప్రధాని మోదీ... ట్విట్టర్‌లో ప్రత్యేక సందేశం...

నేడు మాల్దీవులకు ప్రధాని మోదీ... ట్విట్టర్‌లో ప్రత్యేక సందేశం...

ప్రధాని నరేంద్ర మోదీ (File)

ప్రధాని నరేంద్ర మోదీ (File)

PM Narendra Modi : ప్రధాని మోదీ మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో వెళ్తారు.

రెండోసారి ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్ర మోదీ... తొలి విదేశీ పర్యటనల్లో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి... మాల్దీవులకు వెళ్తున్నారు. రేపు శ్రీలంకకు వెళ్తున్నారు. చుట్టుపక్కల దేశాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామనడానికి ఈ పర్యటనే నిదర్శనం అన్నారు ప్రధాని మోదీ. తీర ప్రాంత దేశాలతో సంబంధాలు మరింత బలపడబోతున్నట్లు తెలిపారు. తనను ఆహ్వానించినందుకు మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవులతో చారిత్రకంగా, సాంస్కృతికంగా భారత్‌కు సంబంధాలున్నట్లు గుర్తుచేశారు. ఈస్టర్ నాడు శ్రీలంకలో జరిగిన ఆత్మాహుతి దాడులపై మరోసారి విచారం వ్యక్తం చేసిన ప్రధాని... శ్రీలంక ప్రజలకు భారత ప్రజలు అండగా ఉంటారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో శ్రీలంకకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ట్వీట్ చేశారు.
మాల్దీవుల్లో మోదీ పర్యటన షెడ్యూల్ :


3.05 మాల్దీవులు చేరనున్న ప్రధాని మోదీ


3.30 రిపబ్లిక్ స్క్వేర్ దగ్గర మోదీకి ప్రత్యేక స్వాగతం


4.00 మాల్దీవుల అధ్యక్షుడితో మోదీ భేటీ


5.30 రెండు దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు


5.45 ప్రెస్ స్టేట్ మెంట్స్


6.00 మాల్దీవుల ఉపాధ్యక్షుడు ఫైసల్ నసీంతో భేటీ


6.30 మాల్దీవుల స్పీకర్ మహమద్ నషీద్‌తో మోదీ భేటీ


6.45 మాల్దీవుల పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం


రెండు దేశాల పర్యటన తర్వాత కొలంబో నుంచీ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తిరుమలకు రాబోతున్నారు. ఆదివారం సాయంత్రం 4.30కు రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు ప్రధాని మోదీ. ప్రోటోకాల్ ప్రకారం సీఎం జగన్, గవర్నర్ నరసింహన్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత విమానాశ్రయానికి దగ్గర్లోనే బీజేపీ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఈ సభకు విజయోత్సవ సభగా పేరు పెట్టారు. సభలో పాల్గొన్న తర్వాత మోదీ... రోడ్డు మార్గాన తిరుమల చేరుకుంటారు.


గెస్ట్ హౌస్‌లో 20 నిమిషాల విశ్రాంతి తర్వాత ప్రధాని మోదీ... వెంకన్న స్వామి దర్శనానికి బయల్దేరతారు. సాయంత్రం 6 గంటలకు వరాహ స్వామిని దర్శిస్తారు. తర్వాత శ్రీవారి ఆలయంలో పూజలు చేస్తారు. రాత్రి 7.20కి మోదీ రోడ్డు మార్గాన తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచీ ప్రత్యేక విమానంలో రాత్రి 8.30కి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.


2014 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని కాక ముందు మోదీ... తిరుమల శ్రీవారిని దర్శించారు. ప్రధాని అయ్యాక... 2015 అక్టోబర్, 2017 జనవరిలో వచ్చారు. మళ్లీ ఇప్పుడు రెండోసారి ప్రధాని అయ్యాక వస్తున్నారు.

First published:

Tags: Maldives, Narendra modi, Sri Lanka, Tirumal;a, Tirumala news

ఉత్తమ కథలు