PM NARENDRA MODI TO MEET ALL STATES CMS ON WEDNESDAY ON COVID SITUATION BA
PM Modi meeting with CMs: ప్రధాని మోదీ ఆకస్మిక నిర్ణయం.. అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ.. రేపు ముహూర్తం.. కారణం ఇదే
ప్రధాని మోదీ(file)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో పాటు పాలు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు కొత్తగా నమోదువుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతున్నారు. ఏప్రిల్ 27వ తేదీ బుధవారం రోజు అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ కావాలని నిర్ణయించారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు (Corona Cases today) పెరుగుతూ ఉండడంతో పాటు పాలు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు కొత్తగా నమోదువుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో (Modi meeting with CMs) సమావేశం కానున్నారు. దేశంలో సోమవారం ఒక్కరోజే 2483 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,62,569 కి (Coronavirus Cases in India) పెరిగింది. అయితే, కేంద్ర వైద్య శాఖ నివేదికల ప్రకారం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,536కి తగ్గింది. 24 గంటల వ్యవధిలో1399 మంది చనిపోయినట్టు వైద్య శాఖ కరోనా బులెటిన్ రిలీజ్ చేసింది. దీంతో కలిపి ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కరోనాతో చనిపోయిన (Corona deaths in India) వారి సంఖ్య 5,23,622 కి పెరిగింది.
మరోవైపు కేంద్ర డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్‌కి (Bharath Biotech) సంబంధించిన కోవాగ్జిన్‌ను (Covaxin) ఆరేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు వారిని వేసేందుకు ఎమర్జెన్సీ అనుమతి ఇచ్చింది. అలాగే కార్బేవ్యాక్స్ (Carbevax)ని 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు వారికి వినియోగించేందుకు కూడా అత్యవసర అనుమతులు ఇచ్చింది. అదే సమయంలో జైడల్ క్యాడిలాకు చెందిన రెండు డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను 12 ఏళ్ల పైబడిన వారికి వాడేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది.
ఏపీలో నాలుగు కరోనా కేసులు (Coronavirus cases in AP)
ఇక ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం ఏప్రిల్ 25 వతేదీ ఉదయం 9 గంటల నుంచి ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 9 గంటల వరకు 3595 శాంపిల్స్ పరీక్షించారు. అందులో నలుగురికి కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో ఒకరికి, ఎన్టీఆర్ జిల్లాలో ముగ్గురికి కరోనా వచ్చింది. మిగిలినజిల్లాల్లో ఎలాంటి కోవిడ్ 19 కేసులు నమోదు కాలేదు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. అలాగే, 24 గంటల వ్యవధిలో 8 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో 34 కరోనా కేసులు
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు 34 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 791827కి పెరిగింది. ఇక 24 గంటల్లో 15 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 232 మంది పేషెంట్లు కరోనాకు చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 4111 మంది చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.