మళ్లీ వారణాసి నుంచీ నరేంద్ర మోదీ పోటీ... ఏజ్ లిమిట్ పక్కన పెట్టిన కమలదళం

వారణాసిలో మోదీ (File)

Narendra Modi Varanasi : సొంత నియోజకవర్గం వారణాసి బాగా కలిసొచ్చిందని భావిస్తున్న నరేంద్ర మోదీ మళ్లీ అక్కడి నుంచే బరిలో దిగబోతున్నారు.

  • Share this:
లోక్‌సభ ఎన్నికలకు ఇంకా రెండు నెలలే టైం ఉండటంతో... ఎవరు ఎక్కడి నుంచీ పోటీ చెయ్యాలనే అంశంపై నేతల నుంచీ ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి కూడా వారణాసి లోక్‌సభ స్థానం నుంచే పోటీ చెయ్యబోతున్నారు. 2014లో ఆయన వారణాసితోపాటూ... గుజరాత్‌లోని వడోదర నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వడోదర నుంచీ తప్పుకున్నారు. ఈసారి కూడా రెండో స్థానం నుంచీ పోటీ చేస్తారా లేదా అన్నది త్వరలో తేలనుంది. శుక్రవారం సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల అంశాలపై మూడు గంటల పాటూ ఈ బోర్డ్ చర్చించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు నరేంద్ర మోదీ. 75వేల ఓట్లతో కేజ్రీవాల్ తర్వాతి స్థానంలో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్.

మోదీ వారణాసి టికెట్‌తోపాటూ... పార్లమెంటరీ బోర్డ్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. పార్టీలో 75 ఏళ్లు దాటిన నేతలు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని నిర్ణయించింది. ఆ వయసులో కూడా పోటీ చేసి గెలవగలరనుకున్న వారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. రాజ్యసభలో కూడా సామర్థ్యం ఉన్న ఆశావహులకు టికెట్లు ఇవ్వనున్నారు.

2014లో విజయం తర్వాత మోదీ సారధ్యంలోని పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో 75 ఏళ్లు దాటిన నేతలు యాక్టివ్ పాలిటిక్స్ నుంచీ తప్పుకోవాలనీ, 70 ఏళ్లు దాటిన వారికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదనీ నిర్ణయించింది. తద్వారా ఎల్కే అద్వానీ లాంటి సీనియర్ నేతలు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. అప్పట్లో మోదీ మేనియా కారణంగా సీనియర్లు ఎవరూ కూడా మోదీ మాటకు ఎదురు చెప్పలేకపోయారు. ఇప్పుడు మోదీ ప్రభ తగ్గడం, పార్టీకి ఇదివరకంత భారీ గెలుపు అవకాశాలు లేకపోవడంతో... సీనియర్లు మళ్లీ గొంతు సవరించుకున్నారు. వారి మాటకు మోదీ తలొగ్గక తప్పలేదు. ఫలితంగా ఈసారి 91 ఏళ్ల ఎల్కే అద్వానీ, 85 ఏళ్ల మురళీ మనోహన్ జోషీ, 77 ఏళ్ల కల్రాజ్ మిశ్రా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి.


ఈసారి బీజేపీ ఆయా రాష్ట్రాల్లో మరింత ఎక్కువ మంది మిత్రపక్షాల్ని కలుపుకుని వెళ్తుందని తెలిసింది. 2014లో బీజేపీతో 16 పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈసారి అవి 29 అవుతాయని తెలిసింది. ఈమధ్యే బీజేపీ... తమిళనాడులోని అన్నాడీఎంకేతో చేతులు కలిపింది. అలాగే మహారాష్ట్రలో శివసేన, బీహార్‌లో లోక్ జనశక్తి పార్టీ, జేడీయూతో కలిసి సాగనుంది.

 

ఇవి కూడా చదవండి :

రూ.13,000 కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ వేసుకున్న జాకెట్ రేటు అక్షరాలా రూ.8,00,000

యూట్యూబ్ అలర్ట్... ఇకపై ఆ వీడియోలకు వార్నింగ్ మెసేజ్

అతని నాలిక రేటు రూ.92 కోట్లు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే...

ఒక్కోటీ ఒక్కో వింత వెబ్ సైట్ ... ఇలాంటివి ఉన్నాయంటే నమ్మలేం
First published: